KCR on CAA: సీఏఏ ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమే..!

|

Mar 07, 2020 | 3:20 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)ను పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనదిగా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ప్రియాంబుల్ (ఉపోద్ఘాతంలో) ప్రస్తావించిన కామెంట్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఓ వర్గాన్ని మినహాయిస్తూ సీఏఏను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కేసీఆర్ ఆరోపించారు.

KCR on CAA: సీఏఏ ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమే..!
Follow us on

KCR said CAA is unconstitutional: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)ను పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనదిగా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ప్రియాంబుల్ (ఉపోద్ఘాతంలో) ప్రస్తావించిన కామెంట్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఓ వర్గాన్ని మినహాయిస్తూ సీఏఏను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. పౌరసత్వాన్ని ఇవ్వడంలో ఒక వర్గాన్ని ఎందుకు మినహాయించాలని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్బంగా సీఏఏను ప్రస్తావించారు. సీఏఏ పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సీఏఏ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్న వాదనలో వందశాతం ఏకీభవిస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. ఏ దేశం నుంచి వచ్చిన వారెవరైనా.. మతాలకు అతీతంగా పౌరసత్వం ఇవ్వవచ్చని కేసీఆర్ అంటున్నారు.

సీఏఏపై టీఆర్ఎస్ పార్టీ వైఖరిని పలుమార్లు వెల్లడించామని, తాజాగా సీఏఏపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా వుందని చెప్పారు కేసీఆర్. సీఏఏను తెలంగాణలో అమలు పరిచేది లేదని కేసీఆర్ మరోసారి కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. సీఏఏలోని లోపాలపై తాను ఇంతకు ముందే బీజేపీ నేతలకు వివరించానని, దాన్ని యధాతథంగా అమలు చేసే ఉద్దేశం తమకేమాత్రం లేదని స్పష్టం చేశారు కేసీఆర్. సీఏఏపై బీజేపీ నేతలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.