కేసీఆర్‌తో చిరు, నాగ్ భేటీ.. ఎందుకంటే..?

వారిద్దరు సీనియర్ సినీ నటులు. వ్యాపారంలోను ఇద్దరు భాగస్తులు. ఓ ప్రైవేటు ఎంటర్‌టైన్‌మెంటు ఛానల్‌లో వారిద్దరికీ వాటాలున్నాయి. అలాంటి వారిద్దరు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలిశారు. ఇంతకీ ఏంటి మేటర్ ?

కేసీఆర్‌తో చిరు, నాగ్ భేటీ.. ఎందుకంటే..?

Updated on: Nov 07, 2020 | 7:41 PM

Chiranjeevi Nagarjuna met KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో సినీ నటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున శనివారం భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ముఖ్యమంత్రితో పలు అంశాలపై సమాలోచనలు జరిపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యంగా సీనియర్ నటులిద్దరు ఇటీవల హైదరాబాద్ వరదల్లో దెబ్బతిన్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన మొత్తాలను ఇచ్చేందుకే సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఒక కోటి రూపాయలు, నాగార్జున 50 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాలకు చెక్కులను వీరిద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా అందజేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకొచ్చాయని తెలుస్తుండగా.. ముఖ్యంగా అన్ లాక్‌డౌన్‌లో భాగంగా సినిమా హాళ్ళను ఎప్పట్నించి తెరవబోతున్నారనే విషయంపై ముఖ్యమంత్రిని సీనియర్ నటులిద్దరు అడిగినట్లు తెలుస్తోంది. సినీ కార్మికులు.. ముఖ్యంగా థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు దుర్బరం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. అయితే, కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు చెబుతున్నారు.

ALSO READ: సినీ లవర్స్‌కు కేసీఆర్ ఒకే రోజు 2 గుడ్‌న్యూస్

ALSO READ: బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్

ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్

ALSO READ: జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస

ALSO READ: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

Loading...
Unable to load recommendations.
Follow Us