ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు ఏపీ సీఎం జగన్. షీలా మృతిపై ఆయన ట్వీట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని జగన్ ట్వీట్ చేశారు.
కడవరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.
Deeply saddened to learn about the demise of Smt Sheila Dixit Ji.
My prayers are with her family in this hour of grief.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2019