CBI Shock రాష్ట్రాలకు సీబీఐ షాక్… ఫిషింగ్ సాఫ్ట్‌వేర్‌తో డేంజర్

|

May 19, 2020 | 6:25 PM

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేసింది. ఇంటర్ పోల్ పేరిట...

CBI Shock రాష్ట్రాలకు సీబీఐ షాక్... ఫిషింగ్ సాఫ్ట్‌వేర్‌తో డేంజర్
Follow us on

Central Bureau of Investigation (CBI) issues alert to states and union territories:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేసింది. ఇంటర్ పోల్ పేరిట ఓ మెసేజ్ పంపడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ను కరప్ట్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నది హెచ్చరిక సారాంశం. తామందిస్తున్న సమాచారం ఆధారంగా తమ తమ రాష్ట్రాల్లో ప్రజలకు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్థలకు, బ్యాంకులకు, ప్రభుత్వ విభాగాలకు నిర్దిష్టమైన హెచ్చరికలు జారీ చేయాలని సీబీఐ రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ వార్నింగ్ పేరిట మొబైల్ ఫోన్లకు మెసేజెస్, ఇంటర్‌నెట్ ద్వారా మెయిల్స్… పంపుతున్నారని సీబీఐ వివరించింది. ఈ మెసేజెస్‌ని, మెయిల్స్‌ని ఓపెన్ చేస్తే మొబైళ్ళు, కంప్యూటర్లలోకి వైరస్ ఇంజెక్ట అవుతుందని, అందులోని సమాచారం కరప్ట్ అవడమో లేదా ఇతరుకు చేరిపోవడమో జరుగుతుందని సీబీఐ తాజాగా చేసిన హెచ్చరికలో పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా సైబర్ క్రైమ్ విభాగాలను యాక్టివ్ చేయాలని సీబీఐ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికార విభాగాలకు సూచించింది.