బుర్కాలో వచ్చి ‘దొంగ ఓట్లు’ వేస్తున్నారంటూ కేంద్రమంత్రి ఆగ్రహం

| Edited By:

Apr 11, 2019 | 12:22 PM

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ బీజేపీ అభ్యర్ధి ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బురఖాలు ధరించిన ఓటర్లను ఎన్నికల అధికారులు తనిఖీ చేయకపోవడం వల్ల ‘దొంగ ఓట్లు’ పోలవుతున్నాయంటూ.. ముజఫర్‌నగర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్ బల్యాన్ ఆరోపించారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బురఖాలు వేసుకున్న మహిళల ముఖాలను తనిఖీ చేయడం లేదు. దొంగ ఓట్లు పడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తన […]

బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కేంద్రమంత్రి ఆగ్రహం
Follow us on

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ బీజేపీ అభ్యర్ధి ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బురఖాలు ధరించిన ఓటర్లను ఎన్నికల అధికారులు తనిఖీ చేయకపోవడం వల్ల ‘దొంగ ఓట్లు’ పోలవుతున్నాయంటూ.. ముజఫర్‌నగర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్ బల్యాన్ ఆరోపించారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బురఖాలు వేసుకున్న మహిళల ముఖాలను తనిఖీ చేయడం లేదు. దొంగ ఓట్లు పడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆందోళనను పట్టించుకోకుంటే రీ-పోల్‌కు డిమాండ్ చేయాల్సి వస్తుందని అన్నారు.