GHMC Elections: బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్-బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

|

Dec 01, 2020 | 10:53 AM

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

GHMC Elections: బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్-బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
Follow us on

GHMC Elections:గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్-బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాషాయం రంగు మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్ద కు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బిజెపి వర్గీయులు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అయితే, బంజారాహిల్స్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి గులాబీ కండువాలతో పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ధి చెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.