ఇప్పటి వరకూ ఆయన అభిమానులు కానీ.. తెలుగు సినీ ప్రేక్షకులు కానీ.. చూడని షాకింగ్ లుక్‌లో బాలయ్య కనిపించారు. బాలయ్య కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అసలు ఇతను బాలయ్యనేనా అని.. షాక్ అయ్యారు కూడా. కేఎస్ రవికుమార్.. బాలయ్య 105వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా.. దసరా సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన మరో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇప్పటికే కొత్త లుక్స్‌లో బాలయ్య అదరగొడుతోన్నారు. దసరా పండుగ సందర్భంగా.. బాలయ్య ఫ్యాన్స్ కోసం సర్‌ప్రైజ్ అంటూ.. ఇప్పటికే చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. కాగా.. బాలయ్య కొత్తలుక్‌లో కేక పుట్టిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ లుక్‌లో బాలకృష్ణ రక్తం అంటిన కత్తిని పట్టుకుని ఉన్నారు. ఆ లుక్ చూస్తుంటే.. ఒంటి నిండా పసుపు, కుంకుమ నిండిపోయి ఉన్నారు. చేతిలో ఓ కత్తి.. దానికి రక్తం కారుతున్నట్టుగా.. కనిపిస్తోంది. బాలయ్య ఫేస్‌లో కోపం, ఆవేశం రెండూ కలగలసి ఉన్నాయి. ఫ్రెంచ్‌లుక్‌లో ఉన్న ఆయన.. సన్నగా.. సూట్ వేసుకుని ఉన్నారు. కాగా.. పోస్టర్‌మీద విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసింది యూనిట్ టీం.
105 సినిమాలో బాలయ్య ఫ్రెంచ్‌లుక్‌లో.. పోలీస్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. దాని కోసం ఇప్పటికే ఇప్పటికే ఆయన పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ‘సంక్రాంతి’ పండుగ కానుకగా రిలీజ్ చేస్తారని.. చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఆ పాత్రకి.. ఈలుక్‌కి సంబంధం ఏంటో కాస్త క్యూరియాసిట్‌గా ఉంది. కాగా.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ 18 నుంచి రామోజీ ఫిలిమ్ సిటీలో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Fierce and Fearless Natasimha #NandamuriBalakrishna from #NBK105
Wishing All A Happy Dussehra#HappyDussehra@sonalchauhan7 @Vedhika4u @prakashraaj @bhumikachawlat#KSRaviKumar @bhattchirantan @ProducerCKalyan @HaappyMovies @UrsVamsiShekar @dhani_aelay pic.twitter.com/sEf0HNfzV4
— BARaju (@baraju_SuperHit) October 7, 2019