ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా…

|

Aug 08, 2020 | 3:03 PM

ఈ వేడుకలను గ‌తంలో క‌న్నా భిన్నంగా నిర్వంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఢిల్లీ అధికారులు. కొవిడ్ నిబంధనలకు అనుగూనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే అతిథులు కూర్చునే..

ఈ ఏడాది స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు ఇలా...
Follow us on

arrange for independence day celebrations in delhi  దేశ‌రాజ‌ధాని ఢిల్లీ.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ముస్తాబవుతోంది. క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ఈ వేడుకలను గ‌తంలో క‌న్నా భిన్నంగా నిర్వంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఢిల్లీ అధికారులు. కొవిడ్ నిబంధనలకు అనుగూనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే అతిథులు కూర్చునే కుర్చీల‌ను రెండు గజాల దూరంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరంను పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో పాల్గొనేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు సోషల్ డిస్టెన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించే ప్లె కార్డులను ఏర్పాటు చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే వేడుక జరిగే ప్రాంతాలకు అనుమతించనున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు వేడుకలు జరిగే ప్రాంతంలోకి రావద్దని సూచిస్తున్నారు. ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సిబ్బంది మాస్కులు ధ‌రించి విధులు నిర్వ‌హిస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం ఈసారి వీఐపీల‌ జాబితాను కూడా తగ్గించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న నిర్వ‌హించే ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొనేవారు. కానీ ఈసారి విద్యార్థుల‌ను అనుమతించడం లేదు. అయితే పాఠశాల విద్యార్థుల‌ స్థానంలో 500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లను ఆహ్వానిస్తున్నారు. అలాగే కరోనా వారియర్స్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి వేడుక‌ల‌కు ఐదు వేల మంది అతిథులు మాత్రమే ఆహ్వానాలు పంపిచారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఈసారి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.