India locked down తెలంగాణ సర్కార్ తొందరపడింది.. ఏపీ మంత్రి విసుర్లు

|

Mar 26, 2020 | 3:57 PM

తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది. అందుకే కొత్త సమస్యలు వచ్చాయి... ఎస్.. ఈ మాటలన్నది ఏపీ మంత్రి. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఏర్పడిన గందరగోళంపై ఏపీ మంత్రి పేర్ని నాని ఇలా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపడి.. ఎన్ఓసీలిచ్చి పంపడం వల్లనే వందలాది మంది...

India locked down తెలంగాణ సర్కార్ తొందరపడింది.. ఏపీ మంత్రి విసుర్లు
Follow us on

AP minister Nani finds fault with Telangana government decision: తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది. అందుకే కొత్త సమస్యలు వచ్చాయి… ఎస్.. ఈ మాటలన్నది ఏపీ మంత్రి. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఏర్పడిన గందరగోళంపై ఏపీ మంత్రి పేర్ని నాని ఇలా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపడి.. ఎన్ఓసీలిచ్చి పంపడం వల్లనే వందలాది మంది ఏపీ విద్యార్థులు సరిహద్దులలో పడిగాపులు గాచే పరిస్థితి వచ్చిందని, దానికి తమ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం లేదని పేర్ని నాని అంటున్నారు.

హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్ళను మూసి వేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది ఏపీ విద్యార్థులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. వారి విఙ్ఞప్తి మేరకు వారందరికీ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఎన్ఓసీలు ఇచ్చి వారు వారి స్వస్థలాలకు వెళ్ళే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అయితే వారందరినీ ఏపీ బోర్డర్ల వద్ద నిలిపి వేయడంతోనే సమస్య మొదలైంది.

విజయవాడ. గుంటూరు, ఏలూరు మార్గాలలో తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు, ప్రైవేటు ఎంప్లాయిస్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం తగదని ఆయనన్నారు. ‘‘ఉధృతిగా వచ్చి ప్రభుత్వాన్ని నిందించడం భావ్యమా..?’’ అని ప్రశ్నించారు.

‘‘తెలంగాణ ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే గరికపాడు చెక్ పోస్ట్ సమస్య వచ్చింది.. ఆ కాగితాలను అసరాగా చేసుకుని ఉధృతంగా వచ్చి తమ ప్రభుత్వాన్ని నిందించడం సరి కాదు.. ఎన్ఓసీ వంటి దుర్మార్గపు కాగితాలు తీసుకున్నప్పుడు కరోనా వచ్చే అవకాశం ఉంది కదా? సమస్య ఉత్పన్నమైన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం.. నిన్న ఉధృతిగా వచ్చిన వారిలో ఎవరెవరు విదేశాల నుండి వచ్చిన వాళ్లతో సంబంధాలు ఉన్నాయో..? వారిలో ఎవరికి కరోనా ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.. థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించడం సరికాదు.. కరోనా లక్షణాలు ఆ క్షణంలో బయట పడేవి కావు.. కరోనా సోకిన తర్వాత 14రోజుల్లో ఏ క్షణమైనా బయటపడే అవకాశం ఉంది.. ’’ అంటూ తెలంగాణ సర్కార్‌పై కామెంట్ చేశారు పేర్ని నాని.

అయితే తెలంగాణ నుంచి వచ్చిన వారందిరీ మెడికల్ టెస్టులు నిర్వహించి, వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రార్థిస్తున్నామని, ఇళ్లలోనే స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రజలంతా బాధ్యతతో గుర్తెరగాల్సిన సమయం ఇదని మంత్రి పిలుపినిచ్చారు.