ఏపీ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ‘రివర్స్ టెండరింగ్’ లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని సీఎం పలు ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్లి హిట్ చేసి చూయించారు. ఇకపోతే పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల్లోనే కాదు..ఖర్చు మిగిలే ప్రతీ అంశలోనూ ఏపీ సర్కార్ రివర్స్ టెండరింగ్‌కి వెళ్తోంది. కొట్లాది రూపాయల సేవ్ అవుతూ ఉండటంతో రివర్స్ టెండరింగ్ విషయంలో పరిదిని విస్తరిస్తోంది జగన్ సర్కార్.
తాజాాగా గ్రామసచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అందించే 4జీ సిమ్‌ల విషయంలోనూ రివర్స్ టెండర్‌కు వెళ్లింది ఏపీ ప్రభుత్వం . 199 రూపాయల బేసిక్ 4జీ ప్లాన్ సిమ్‌ల కొనుగోలుకు మొదట వచ్చిన బిడ్ విలువ 121కోట్ల 54 లక్షలు. కానీ రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడంతో 87 కోట్ల 77 లక్షలకే సిమ్‌లు అందించేందుకు ముందుకొచ్చింది ఓ సంస్థ. దీంతో 33 కోట్ల 76 లక్షలు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. అంటే ఒక్కో సిమ్ మీద 107 రూపాయలు మిగలగా..ప్రభుత్వం మొత్తం 2 లక్షల 64 వేల సిమ్‌లు కొనుగోలు చేస్తోంది.