ప్రభుత్వాసుపత్రిలో అవయవాలు మాయం

| Edited By:

Jul 26, 2019 | 11:55 AM

ఒడిశాలోని ఓ హాస్పిటల్‌లో మానవ అవయవాలు మాయమైపోతున్నాయి. పోస్ట్‌మార్టమ్ కోసం వచ్చిన మ‌ృతదేహాలను హాస్పిటల్ మార్చురీలో భద్రపరుస్తారు. సరిగ్గా ఇక్కడినుంచే అవయవాలు మాయం చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లా జరపాత నగరానికి చెందిన బంబేశ్వర్‌నాయక్ అనే వ్యక్తి సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలపాలు కావడంతో జిల్లా హాస్పిటల్‌లో చికిత్సకోసం తరలించారు. అయితే అప్పటికే అతడు మ‌ృతి చెందాడు. అతడి మ‌ృతదేహానికి పోస్టుమార్టం కోసం వైద్యులు మార్చురీకి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మరుసటిరోజుకు […]

ప్రభుత్వాసుపత్రిలో అవయవాలు మాయం
Follow us on

ఒడిశాలోని ఓ హాస్పిటల్‌లో మానవ అవయవాలు మాయమైపోతున్నాయి. పోస్ట్‌మార్టమ్ కోసం వచ్చిన మ‌ృతదేహాలను హాస్పిటల్ మార్చురీలో భద్రపరుస్తారు. సరిగ్గా ఇక్కడినుంచే అవయవాలు మాయం చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లా జరపాత నగరానికి చెందిన బంబేశ్వర్‌నాయక్ అనే వ్యక్తి సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలపాలు కావడంతో జిల్లా హాస్పిటల్‌లో చికిత్సకోసం తరలించారు. అయితే అప్పటికే అతడు మ‌ృతి చెందాడు. అతడి మ‌ృతదేహానికి పోస్టుమార్టం కోసం వైద్యులు మార్చురీకి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మరుసటిరోజుకు వాయిదా వేశారు. ఆ తర్వాత రోజు మృతదేహాన్ని బయటకు తీసి చేస్తే జంబేశ్వర్‌నాయక్ శరీరం నుంచి ఒక కన్ను మాయమైంది. దీనిపై మృతుని బంధువులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక మృతదేహం నుంచి రెండు కళ్లు పీకేశారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌లో ఈవిధంగా అవయవాలు ఎత్తుకుపోవడంపై రోగులు, మృతుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చురీ సిబ్బంది ప్రమేయం లేకుండా ఇలా అవయవాలు మాయం కావని ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ అవయవాల మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.