Amphan dangerous అనుకున్నదానికంటే ఆంఫన్ డేంజరస్

ఒడిశా మొదలుకుని బెంగాల్ సహా ఉత్తరాదిని అతలాకుతలం చేసే శక్తిగా ఆంఫన్ తుఫాను బలపడుతోందని వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ.

Amphan dangerous అనుకున్నదానికంటే ఆంఫన్ డేంజరస్

Updated on: May 18, 2020 | 3:15 PM

Amphan cyclone is becoming more stronger day by day: ఒడిశా మొదలుకుని బెంగాల్ సహా ఉత్తరాదిని అతలాకుతలం చేసే శక్తిగా ఆంఫన్ తుఫాను బలపడుతోందని వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఆంఫన్ తుఫాను ఎక్స్‌ట్రీమ్లీ సీవియర్ అని వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ మెటిరియోలోజికల్ డిపార్ట్‌మెంట్. ఈ మేరకు వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతోపాటు యుపి, బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను, కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు సోమవారం హెచ్చరికలు జారీ చేసింది.

సోమవారం తెల్లవారుజాము వరకు గంటకు 13 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న అంఫన్ సూపర్ సైక్లోన్ బుధవారం మధ్యాహ్నం బెంగాల్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు అంఛనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 820 కి.మీల దూరంలోను, బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 980 కి.మీల దూరంలోను అంఫన్ తుఫాను కేంద్రీక‌తమై.. ఉధృత రూపాన్ని సంతరించుకుందని మెట్ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి కల్లా ఈ తుఫాను మరింత తీవ్రతరమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

బుధవారం (మే 20వ తేదీ) మధ్యాహ్నం అంఫన్ తుఫాను బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు అంఛనా వేస్తున్నారు. తీరం దాటే సందర్భంలో ఒడిశా, బెంగాల్ తీరంలో 110-120 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని వారంటున్నారు.