‘కరోనా వేటు’.. 61 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు విరామం

| Edited By: Pardhasaradhi Peri

Apr 04, 2020 | 4:06 PM

అత్యంత సీనియర్ మోస్ట్ పైలట్.. 1999 డిసెంబరులో ఐసీ 814 విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేసిన ఘటనలో ఆయన లాఘవంగా వ్యవహరించి.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడగలిగారు. కాగా తన సస్పెన్షన్ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

కరోనా వేటు.. 61 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు విరామం
Follow us on

కరోనా వైరస్ కారణంగా ఎయిరిండియా మరింత నష్టాల బాట పట్టింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేయడంతో ఈ విమానాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. తమ సంస్థ ఖర్చులను మరింతగా తగ్గించుకునేందుకు ఎయిరిండియా 61 మంది పైలట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇటీవలే చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన భారతీయులను తిరిగి ఇండియాకు చేర్చేందుకు తమ  సర్వీసులందించిన ఇద్దరు పైలట్లు కూడా సస్పెన్షన్ వేటుకు గురైనవారిలో ఉన్నారు.  సస్పెండయిన వారిలో కెప్టెన్ దేవీ శరణ్, కెప్టెన్ ఎస్.హెచ్.రెజా వంటి సీనియర్ కెప్టెన్లు ఉన్నారు. వూహాన్ సిటీకి గత జనవరి 31 న,  ఫిబ్రవరి 1 న విమానాన్ని నడిపిన నలుగురు పైలట్లలో రెజా ఒకరు. ప్రభుత్వం నుంచి ఆయన లాంఛనంగా ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. ఇక 1985 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో చేరిన దేవీ శరణ్.. అత్యంత సీనియర్ మోస్ట్ పైలట్.. 1999 డిసెంబరులో ఐసీ 814 విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేసిన ఘటనలో ఆయన లాఘవంగా వ్యవహరించి.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడగలిగారు. కాగా తన సస్పెన్షన్ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.