ఓ మహిళ కడుపులో వందలాది రాళ్లు

ఓ మహిళ కడుపులో వందలాది రాళ్లు బయటపడ్డాయి. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నక్కలపల్లి గ్రామానికి చెందిన పుష్పలత ఈ నెల 11న కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. గ్లాడ్ బ్లాడర్ లో ఒకటో, రెండో రాళ్లు ఉంటాయని భావించిన డాక్టర్లు.. స్కానింగ్ చేసి చూడగా వందలాది రాళ్లు కనిపించాయి. పుష్పలతకు ఆపరేషన్ చేసి రాళ్లు బయటకు తీశారు డాక్టర్లు. దాదాపు 45 నిమిషాలపాటు ఆపరేషన్ చేసి 15 వందల 38 […]

ఓ మహిళ కడుపులో వందలాది రాళ్లు

Edited By:

Updated on: Feb 18, 2019 | 8:43 AM

ఓ మహిళ కడుపులో వందలాది రాళ్లు బయటపడ్డాయి. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నక్కలపల్లి గ్రామానికి చెందిన పుష్పలత ఈ నెల 11న కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. గ్లాడ్ బ్లాడర్ లో ఒకటో, రెండో రాళ్లు ఉంటాయని భావించిన డాక్టర్లు.. స్కానింగ్ చేసి చూడగా వందలాది రాళ్లు కనిపించాయి. పుష్పలతకు ఆపరేషన్ చేసి రాళ్లు బయటకు తీశారు డాక్టర్లు. దాదాపు 45 నిమిషాలపాటు ఆపరేషన్ చేసి 15 వందల 38 రాళ్లను తొలగించారు. వైద్య రంగంలో ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయని, ప్రస్తుతం పుష్పలత ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.