బిహార్ లో పిడుగుపాటుకు 83 మంది మృతి

|

Jun 25, 2020 | 9:43 PM

బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చనిపోయారు.

బిహార్ లో పిడుగుపాటుకు 83 మంది మృతి
Follow us on

బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 83మంది చనిపోయారు. గోపాల్‌గంజ్‌జిల్లాలో 13మంది, నవాడా నుంచి 8, సివాన్‌, భగల్పూర్‌నుంచి చెరో ఆరుగురు, దర్భాంగ, బంకా నుంచి చెరో ఐదుగురు చొప్పున.. ఇలా పలు ప్రాంతాల్లో మొత్తం 83మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. మృతిచెందిన వారిని ఆదుకుంటామన్నారు.
రానున్న మూడు రోజుల్లో అస్సాం, మేఘాల‌య‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. జనం అవసరమైతే తప్ప బయటకు రావద్దని. ముఖ్యంగా లోత‌ట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త ఆర్కె జెన‌మ‌ని అన్నారు.