ఈ కచ్చిలి చేప రేటు ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

 ఏపీలో ప్రజంట్ పులస చేపల సీజన్ నడుస్తోంది. ఈ చేప రేటు వింటే జనాలకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇటీవల రెండున్నర కిలోల బరువున్న పులస చేపను పాశర్లపూడి గ్రామానికి చెందిన....

ఈ కచ్చిలి చేప రేటు ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Updated on: Sep 23, 2020 | 1:06 PM

 ఏపీలో ప్రజంట్ పులస చేపల సీజన్ నడుస్తోంది. ఈ చేప రేటు వింటే జనాలకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇటీవల రెండున్నర కిలోల బరువున్న పులస చేపను పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఏకంగా రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ విషయం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడి వలకు మంగళవారం 28 కిలోల అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ఏరియాకి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలకు దక్కించుకున్నారు. ఈ చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత ఖరీదు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై యూజీసీ ప్రకటన, సెలవులు కట్

Loading...
Unable to load recommendations.
Follow Us