విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్ జరిగింది. పెద్దబయలు మండలం బురదమామిడి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమవ్వగా, ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. మరో 20మంది మావోలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యం, రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్‌ను ప్రకటించారు.