జామా మసీదు ప్రాంతంలో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో 11 మందికి..

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడు. అయితే అతడికి కరోనా పరీక్షలు జరపగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్లులు జరిపారు. దీంతో […]

జామా మసీదు ప్రాంతంలో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో 11 మందికి..

Edited By:

Updated on: Apr 23, 2020 | 6:01 PM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడు. అయితే అతడికి కరోనా పరీక్షలు జరపగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్లులు జరిపారు. దీంతో కుటుంబంలోని 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. గడిచిన 24 గంటల్లో 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,248కి చేరింది.