చైనా ఉత్పత్తులను నిషేధించండి.. ట్విట్టర్ లో ట్రెండింగ్

న్యూఢిల్లీ :  జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా మరోసారి అడ్డుకోవడంపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచీ చైనా ఉత్పత్తులను నిషేధించండి (#BoycottChineseProducts) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం టాప్ ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా ఉండటం విశేషం. అయితే మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని.. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తీసుకురాగా.. […]

చైనా ఉత్పత్తులను నిషేధించండి.. ట్విట్టర్ లో ట్రెండింగ్
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 4:27 PM

న్యూఢిల్లీ :  జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా మరోసారి అడ్డుకోవడంపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచీ చైనా ఉత్పత్తులను నిషేధించండి (#BoycottChineseProducts) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం టాప్ ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా ఉండటం విశేషం. అయితే మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని.. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తీసుకురాగా.. చైనా మరోసారి దానిని అడ్డుకుంది. కాగా చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం ఇది నాలుగోసారి. చైనా తీరుపై అమెరికా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర మార్గాల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక అప్పటి నుంచీ ట్విటర్‌లో చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. భారత్.. చైనాకు ఎంత ఎగుమతి చేస్తోంది.. ఎంత దిగుమతి చేసుకుంటోంది… వాణిజ్య లోటు ఎంత ఉంది అంటూ ఒకరు లెక్కలు తీయగా.. 1945లో జపాన్‌పై అమెరికా బాంబు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఆ దేశస్థులు అమెరికా వస్తువులను వాడటం లేదని, దేశభక్తి అంటే ఇదీ అని మరొకరు ట్వీట్ చేశారు.