కన్నబాబు రిప్లేస్‌మెంట్..వ్యవసాయ బడ్జెట్ బొత్స చేతుల్లోకి

Botsa Satyanarayana will present agriculture budget instead of Kanna Babu, కన్నబాబు రిప్లేస్‌మెంట్..వ్యవసాయ బడ్జెట్ బొత్స చేతుల్లోకి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు ఇటీవలే గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ షడన్ షాక్ నుంచి మంత్రి కన్నబాబు ఇంకా కోలుకోలేదు. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నారు. దీంతో రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన వ్యవసాయ బడ్జెట్‌ను వ్వవసాయ శాఖ మంత్రి  కన్నబాబు స్థానంలో బొత్స సత్యనారాయణ ప్రవేశపెడతారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రభుత్వం తొలిసారి పూర్తిస్తాయి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పద్దును సభలో ప్రవేశపెడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *