Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు నామాలే’ అంటున్న సీఎం కేసీఆర్.. ఎందుకలా?

ఆదివారం జరిగిన శాసనసభలో బీజేపీపై ఒంటికాలిపై లేచారు సీఎం కేసీఆర్. అధికారం కోసం ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీకి తనదైన శైలిలో చురకలు వేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకవేళ తెలంగాణలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ప్రజలకు నామాలు తప్ప ఇంకేమీ మిగలవంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగన చర్చలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించి […]

'బీజేపీ అధికారంలోకి వస్తే  ప్రజలకు నామాలే' అంటున్న సీఎం కేసీఆర్.. ఎందుకలా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2019 | 5:42 PM

ఆదివారం జరిగిన శాసనసభలో బీజేపీపై ఒంటికాలిపై లేచారు సీఎం కేసీఆర్. అధికారం కోసం ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీకి తనదైన శైలిలో చురకలు వేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకవేళ తెలంగాణలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ప్రజలకు నామాలు తప్ప ఇంకేమీ మిగలవంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగన చర్చలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించి రైతులకు అండగా నిలుస్తున్నా కేంద్రం ఏమాత్రం నిధులను మంజూరు చేయడం లేదంటూ ఆయన విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించామని, వీటికి నిధులు ఇవ్వాలని నీతీ ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పేదల కోసం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని, వారు చెప్పేది ఒక్కటి, చేసేది మరొకటిగా ఉందనే విధంగా సీఎం వ్యాఖ్యానించారు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు తప్పితే రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదంటూ ఆరోపించారు కేసీఆర్. పొరబాటున బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆరోగ్య శ్రీ ఆగిపోతుందని, ఆయుష్మాన్ భారత్ వస్తుందన్నారు. ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతు బంధు ఇస్తున్నామని ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మాన్‌‌లో ఇచ్చేది రూ.5 వేలే. రైతు బీమా ఉండదన్నారు. తెలంగాణలో ఏ రైతు చనిపోయినా రూ.10 వేలు ఇస్తున్నామని, వృధ్యాప్య పించన్ల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.2016 పెన్షన్ పోయి రూ. 600 ఇస్తారని కేసీఆర్ చెప్పారు.

తమ ప్రభుత్వ పాలనలో రైతులకు అండగా నిలవడం చూసి పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లాలో నలభై గ్రామాల సర్పంచ్‌లు తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైన ఇక్కడ అమలవుతున్న పథకాల వంటివి ఉన్నాయా? మీరు అమలు చేయగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు నామాలు తప్ప ఇంకేమీ మిగలవంటూ ఎద్దేవా చేశారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రస్తుతం లక్షన్నర కోట్ల అప్పుల్లో ఉంది. మరోవైపు రైతులు యూరియా కోసం ఇప్పటికీ క్యూ కడుతూనే ఉన్నారు. ఎక్కడిక్కడ అనేక సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతునే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆదుకోవాల్సిన కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం పంక్తు రాజకీయం ఆడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎన్నికైన నెల రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని వాగ్దానం చేసిన బీజేపీ ఎంపీ మాట.. కేవలం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే దాన్ని పండించే రైతుకు ఎంతో మేలు చేకూరే పరిస్థితి ఉంది. తమ పంటకు గిట్టుబాటు ధరను రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ముఖ్యంగా యూరియా… ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన అంశం. ఇది పైనుంచి దిగుమతి చేసుకునేది. కేంద్రమే ఆయా రాష్ట్రాలకు కోటా నిర్ణయిస్తుంది. తెలంగాణకు రావాల్సిన కోటా విషయంలో కేంద్రం అలసత్వం కారణంగా రాలేదు. అయితే దాన్ని కప్పిబుచ్చి కేవలం రాజకీయ విమర్శలు చేస్తోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అధినేతకు చిరాకు రప్పిస్తూనే ఉన్నాయి.

అదే విధంగా రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ, హోం మంంత్రి అమిత్‌షాలు రెండు నాల్కల ధోరణిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా న్యాయం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానంగానే కనిపించాలి. కానీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఇకనైనా మానుకోవాలంటూ సీఎం కేసీఆర్ చెప్పడం సబబే అంటున్నారు. గతంలో రైతుబంధు పథకంపై కేంద్రం అభినందించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ అధికారమే పరమావథిగా బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల్ని కేసీఆర్ సమర్ధవంతంగా తిప్పికొట్టారనడంలో సందేహమే లేదు. ఆదివారం తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇక బీజేపీ నేతలే సమాధానం చెప్పడమే ఆలస్యం.