యడియూరప్ప సంచలన నిర్ణయం..

BJP government cancels Tipu Sultan Jayanti celebrations in Karnataka, యడియూరప్ప సంచలన నిర్ణయం..

సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు యడియూరప్ప. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలను ముందునుంచే బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ వేడుకలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని.. అందుకే రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. 2016 నుంచి టిప్పు జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది. అయినప్పటికీ పట్టుబట్టి వేడుకలను నిర్వహించారు అప్పటి కర్నాటక సీఎం సిద్ధరామయ్య.

అయితే దీనిని వ్యతిరేకిస్తున్న బీజేపీపై మండిపడుతున్నారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణత్యాగం చేసిన సుల్తాన్‌కు మతం రంగు పులమడం సరికాదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *