బిగ్ బాస్ హౌస్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తుంది. ఈ సీజన్ లో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆఖరి నామినేషన్ కూడా మొదలైపోయింది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో ఉన్నఆరుగురిలో ఐదుగురిని నామినేట్ చేసాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే విన్ అవ్వడం వల్ల అఖిల్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే ఈ సారి బిగ్ బాస్ విజేత ఆపైన ప్రేక్షకుల్లో బిగ్ డిబేటే జరుగుతుంది. గత మూడు సీజన్స్ లో అబ్బాయిలే విన్ అవుతూ వస్తున్నారు. ఈసారి అమ్మాయికి ఛాన్స్ ఇస్తారా లేక మరోసారి కూడా అబ్బాయే విజేత అవుతాడా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందచందాలతో పాటు అల్లరితో ఆకట్టుకుంటున్న హారిక బిగ్ బాస్ విజేత అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ అలరించిన హారికా అభిమానులను భారీగానే సంపాదించుకుంది. తెలంగాణ మాండలికంలో ముద్దుముద్దుగా మాట్లాడుతూ తన అల్లరితో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల టైంలో ఈ చిచ్చర పిడుగు భలే ఆడుతుందని పొగిడేస్తున్నారు నెటిజన్లు. హారిక మనసులో ఏం ఉంచుకోకుండా మాట్లాడుతుందని, జన్యున్ గా గేమ్ ఆడుతుంది కాబట్టి ఈ సారి హారిక విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. హౌస్ లో అందరితోనూ సరదాగా ఉండే హారిక అభిజిత్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనికూడా నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఎలిమినేషన్ టైంలో ఆమెకు ప్రేక్షకులు భారీగానే ఓట్లు గుద్ది బయటపడేసారు. మరి ప్రేక్షకులు ఇప్పుడు ఈ అమ్మడిని విజేతను చేస్తారో లేదో చూడాలి.
ఇక అభిజిత్ విషయానికొస్తే ఈ కుర్రాడు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. అమాయకంగా, క్యూట్ గా కనిపించే అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సినిమాలతో అభిమానులను సంపాదించుకోలేకపోయినా బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన దగ్గరనుంచి అభిజిత్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారనే చెప్పాలి. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన ఆట తాను ఆడుతూ వస్తున్నాడు. వచ్చిన మొదట్లో మోనాల్ తో క్లోజ్ గా ఉన్న అభి ఆ తరవాత ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. మోనాల్ విషయంలో అఖిల్ కు అభిజిత్ కు మధ్య ఓ మినీ యుద్ధమే జరిగింది అప్పట్లో. ఇక మోనాల్ ను దూరం పెట్టినప్పటికీ అఖిల్-అభిజిత్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ సారి అభిజిత్ విన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. బయట అభిజిత్ కు సపోర్ట్ చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. అభిజిత్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. నామినేట్ అయిన ప్రతిసారి ప్రేక్షకులు ఓట్లు వేసి అభిజిత్ ను ఎలిమినేషన్ నుంచి తప్పిస్తున్నారు. అయితే హౌస్ లో ఇంతవరకు ఎప్పుడూ కెప్టెన్ అవ్వలేదు ఈ కుర్రాడు కానీ ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ను మాత్రం కొడతాడని నెటిజన్స్ గట్టిగానే చెప్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అభిజిత్ విన్ అవుతాడంటూ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఏంజరుగుతుందో.