టైటిల్ వేటలో వెనుకబడిపోతున్న సోహైల్.. ఆ కంటెస్టెంట్‏తో అలా ప్రవర్తించడమే కారణామా?

|

Dec 09, 2020 | 12:28 PM

బిగ్‎బాస్ షో మొదట్లో చాలా కోపంతో ఇంటి సభ్యుల మీద విరుచుకుపడేవాడు సోహైల్. ఆ తర్వాత నాగార్జున కోపాన్ని తగ్గించుకోమని చెప్పడంతో కాస్త కంట్రోల్‏గా గేమ్ ఆడుతూ వస్తున్నాడు.

టైటిల్ వేటలో వెనుకబడిపోతున్న సోహైల్.. ఆ కంటెస్టెంట్‏తో అలా ప్రవర్తించడమే కారణామా?
Follow us on

Big Boss Season4: బిగ్‎బాస్ షో మొదట్లో చాలా కోపంతో ఇంటి సభ్యుల మీద విరుచుకుపడేవాడు సోహైల్. ఆ తర్వాత నాగార్జున కోపాన్ని తగ్గించుకోమని చెప్పడంతో కాస్త కంట్రోల్‏గా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. అయితే బిగ్‎బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు తన ఆట తీరుతో ప్రేక్షకుల మెప్పు పొందాడు సోహైల్. ప్రస్తుతం ఉన్న ఇంటిసభ్యులు టైటిల్ సాధించడానికి ఎవరికివారు గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే ఇప్పటివరకు టాప్‏లో ఉన్న సోహైల్ గత రెండు రోజుల నుంచి డ్రాప్ అవుతున్నాడు. అంతేగాక ప్రేక్షకుల నుంచి చిన్న అసహనం కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. టికేట్ టూ ఫినాలే టాస్కులో సోహైల్ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. టికెట్ టు ఫినాలే మెడల్‏ను అఖిల్‏కు త్యాగం చేశాడు. దీంతో సోహైల్ త్యాగం వల్లె అఖిల్ ఫినాలెకు వెళ్ళడాని అతని ఫ్యాన్ ప్రచారం చేస్తున్నారు. కాగా తాజాగా రాజారాణి టాస్క్‏లో సోహైల్ అరియానా పట్ల ప్రవర్తించిన తీరుతో భారీగా విమర్శలను మూటకట్టుకున్నాడు. అయితే నిన్న ఇచ్చినా టాస్క్‏లో కూడా సోహైల్ ఆమె సెంటిమెంట్ కాఫీ కప్పుని పగలగొట్టేశాడు. అంతే కాకుండా తనకు ఇష్టమైన చింటూ బొమ్మను చింపడానికి ప్రయాత్నించాడు. దీంతో సోహైల్ అరియానా పట్ల వ్యవహరిస్తూన్న తీరుతో ఆమెకు సింపథి ఓట్లు పడేలా ఉన్నాయి. అంతేకాకుండా సోహైల్ విలన్‏గా మారిపోతూ ఉండడంతో అతనికి ఓట్లు తగ్గేలా ఉన్నాయన్నా టాక్ వినిపిస్తుంది. చూడాలి మరీ ప్రేక్షకుల ఓటింగ్ ఏలా ఉంటుందో.