Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ పనిష్మెంట్‌కి నెటిజన్ల రియాక్షన్లు ఇవే

బుల్లితెరపై బిగ్‌బాస్ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మొన్నటివరకు కంటెస్టెంట్‌లకు పెద్దగా శిక్షలు వేయని బిగ్‌బాస్, ఇప్పుడు పనిష్మెంట్‌లను ప్రారంభించారు

Bigg Boss 4: బిగ్‌బాస్ పనిష్మెంట్‌కి నెటిజన్ల రియాక్షన్లు ఇవే

Updated on: Sep 19, 2020 | 11:58 AM

Bigg Boss Telugu 4: బుల్లితెరపై బిగ్‌బాస్ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మొన్నటివరకు కంటెస్టెంట్‌లకు పెద్దగా శిక్షలు వేయని బిగ్‌బాస్, ఇప్పుడు పనిష్మెంట్‌లను ప్రారంభించారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌజ్‌లో నిబంధనలను ఎవరూ పాటించడం లేదని ఫైర్ ‌అయిన బిగ్‌బాస్ వారికి శిక్షలు వేశారు. ప్రతిసారి బెల్ మోగినప్పుడల్లా గార్డెన్ ఏరియాలో నిలబడి 20 గుంజీళ్లు తీయాలని హౌజ్ సభ్యులకు బిగ్‌బాస్ పనిష్మెంట్ ఇచ్చారు.

అలాగే తెలుగు మాట్లాడని వారు ఇకపై తెలుగులోనే మాట్లాడాలి చెబుతూ.. ”బిగ్‌బాస్ న‌న్ను క్ష‌మించండి, ఇప్ప‌టి నుంచి తెలుగులోనే మాట్లాడ‌తాము” అని రాయమన్నారు. ఇక ఈ పనిష్మెంట్ అప్పుడే నోయెల్‌, బిగ్‌బాస్‌కి సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే మొత్తానికి బిగ్‌బాస్ పనిష్మెంట్‌లను ఇవ్వడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ నిద్రలేచాడు. క్వారంటైన్‌ని పూర్తి చేసుకున్నారు. హమ్మయ్య తెలుగు లేకుండానే ఈ షో ముగుస్తుందనుకున్నా కానీ ఇకపై తెలుగు మాటలను వినొచ్చు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇవాళ వ్యాఖ్యత నాగార్జున షోకు రానున్నారు. మరి ఈ రోజు ఆయన ఎవరికి వార్నింగ్ ఇవ్వబోతున్నారు..? ఎవరికి ఎలాంటి క్లాస్ పీకబోతున్నారు..? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Read More:

ఆందోళన అక్కర్లేదు.. పిల్లల్లో ఆ లక్షణం కరోనా కాదు

చంద్రబాబుకు షాక్‌.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై

Loading...
Unable to load recommendations.
Follow Us