ఈ భోగానికి నేను అర్హురాలిని కాదేమో.. ఇక్కడ మహారాణిలా బతుకుతున్నా.. బిగ్‏బాస్‏కు బోల్డ్ బ్యూటీ థ్యాంక్స్..

|

Dec 08, 2020 | 11:03 AM

బిగ్‏బాస్ నాలుగో సీజన్‏లో ఆఖరి నామినేషన్స్ జరిగాయి. అఖిల్ తప్ప ఇంట్లోని సభ్యులు మొత్తం ఈ వారం నామినేట్ అయ్యారు. అనంతరం వారికి ఇచ్చిన రాజారాణి టాస్క్‏లో ఎవరికి నచ్చిన

ఈ భోగానికి నేను అర్హురాలిని కాదేమో.. ఇక్కడ మహారాణిలా బతుకుతున్నా.. బిగ్‏బాస్‏కు బోల్డ్ బ్యూటీ థ్యాంక్స్..
Follow us on

Big Boss Season 4: బిగ్‏బాస్ నాలుగో సీజన్‏లో ఆఖరి నామినేషన్స్ జరిగాయి. అఖిల్ తప్ప ఇంట్లోని సభ్యులు మొత్తం ఈ వారం నామినేట్ అయ్యారు. అనంతరం వారికి ఇచ్చిన రాజారాణి టాస్క్‏లో ఎవరికి నచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. సోహైల్ రాజుగా వ్యవహరించినప్పుడు అరియానాను ఏడిపించాలకున్నాడు. కానీ అది కుదరకపోగా ఇంట్లో నవ్వులు పూసాయి. తర్వాత హారిక రాణి అయినప్పుడు మాత్రం గొడవలు జరిగాయి.

అయితే హౌస్‏లో స్ట్రాంగ్ లేడిగా పేరు తెచ్చుకున్న అరియానా సోమవారం కాస్తా ఎమోషనల్ అయ్యింది. కెమెరా ముందుకు వచ్చి తన బాధను వ్యక్తం చేసింది. “నా మొదటి జీతం రూ.4 వేలు. ఆ తర్వాత చాలా కష్టపడ్డాను. ఆ కష్టం వల్లె నేను బిగ్‏బాస్ షోకు రావడం జరిగింది. నేను ఎంత సంపాదించిన దానితో నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను. పాపులారిటీ గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. నేను బిగ్‏బాస్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ సారి మహిళ విన్నర్ కావాలని ఆశతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను. ఇక్కడ మహారాణిలా బతుకుతున్నా.. ఒక్కోసారి ఈ భోగానికి నేను అర్హురాలిని కాదేమో అనిపిస్తుంది. కానీ ప్యాలెస్‏లో ఉండాలన్న కల ఎట్టకేలకు తీరింది” అని బిగ్‏బాస్‏కు థ్యాంక్స్  చెప్పింది ఈ బోల్డ్ బ్యూటీ.