bigg boss 4 telugu sohel frustrated on chintu ‘‘నిన్ను అరియానా తీసుకెళ్లలేదా? నువ్వు వట్టి ఎమోషనల్.. అనవసరంగా మోసపోతున్నావు రా’’ అని బొమ్మతో కబుర్లు పెట్టాడు సోహైల్. ఇంతలోనే ఈ గొడకు మూల కారణం చింటూ అని గుర్తొచ్చిందో ఏమో చింటూగాడిని చంపేస్తానంటూ ఆ బొమ్మ బెదిరించాడు. బొమ్మను పాడు చేయాలని ప్రయత్నించగా… మోనాల్ అడ్డుకుంది. అయితే సోహైల్ చేసిన చర్యలు నవ్వు తెప్పించాయి.
కాగా, గత ఎపిసోడ్లో అరియానా, సోహైల్ పరస్పరం తిట్టుకున్నారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో వారు టామ్ అండ్ జెర్రీలు అని అంతా అనుకుంటారు. కానీ, ఎప్పుడూ చిన్నచిన్న గొడవలు పడి వెంటనే కలిసిపోయే వీళ్లిద్దరూ నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం తీవ్రస్థాయి ఘర్షణకు దిగారు. లెక్కలేనన్ని మాటలు అనుకన్నారు. ఒకరి మీద ఒకరు నోరు జారారు. చివరికి ఇద్దరూ ఏడ్చారు. అయితే సోహైల్, అరియానా ఈ రోజు ఎపిసోడ్‌లోనైనా కలిసిపోతారో లేదో చూడాలి.