Bigg Boss 4: ఏడ్చేసిన అరియానా.. అందరిలో మోనాల్‌, హారిక బెస్ట్‌.. సొహైల్‌, అఖిల్ పరువు తీసిన నాగ్‌

| Edited By: Anil kumar poka

Dec 02, 2020 | 12:57 PM

సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా చీకటిలో ధైర్యం స్థైర్యం టాస్క్‌ని మరోసారి కంటెస్టెంట్‌ల చేత చేయించారు నాగార్జున.

Bigg Boss 4: ఏడ్చేసిన అరియానా.. అందరిలో మోనాల్‌, హారిక బెస్ట్‌.. సొహైల్‌, అఖిల్ పరువు తీసిన నాగ్‌
Follow us on

Bigg Boss 4 Telugu: సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా చీకటిలో ధైర్యం స్థైర్యం టాస్క్‌ని మరోసారి కంటెస్టెంట్‌ల చేత చేయించారు నాగార్జున. ఈ క్రమంలో మొద‌ట‌గా అరియానా దెయ్యం గ‌దిలోకి వెళ్ల‌డానికి నిరాకరించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని అరియానా ఏడ్చేసింది. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. ఇక ఆ త‌రువాత సొహైల్‌ లోప‌ల‌కు వెళ్లాడు. గజ్జల శబ్దం వినేసరికి గజగజ వణికిపోయాడు. ఇక అఖిల్‌ లోపలికి వెళ్లి తన భయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఇక అఇజిత్‌ అయితే ఈలలు వేసుకుంటూ వెళ్లాడు కానీ.. లోపల భయపడ్డాను సర్ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఇక అవినాష్‌ దెయ్యం అరుపులకు భయపడుతూ రూమ్ మొత్తం కలియతిరిగాడు. అయితే అందరిలో హారిక, మోనాల్‌ ఇద్దరు ఏమాత్రం అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. లోపలకి వెళ్లి తమ టాస్క్‌ని పూర్తి చేశారు. కాగా మొన్నటి దెయ్యం టాస్క్‌లో అఖిల్‌, సొహైల్‌లు బాగా దడుచుకున్న విషయం తెలిసిందే. తొడకొట్టి లోపలికి వెళ్తాం అన్న ఇద్దరూ లోపల వణికిపోయారు. ఇక ఆ వీడియోను నాగ్‌ కంటెస్టెంట్‌లకు చూపించి, వారి పరువు తీశారు. ఇది ముగిసిన తరువాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంట‌రిగా గదిలోకి వెళ్లి.. భయాన్ని పోగొట్టుకున్నానని సంతోషపడింది.