Nagarjuna slams Abhijeet: వారాంతంలో ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్ట్‌లను కడిగిపారేశారు నాగార్జున. ముఖ్యంగా హారిక, అభిజిత్‌లకు గట్టి క్లాస్ పీకారు. అభి దగ్గరకు వెళ్లగానే.. బిగ్‌బాస్ గేట్లు తెరవండని.. అతడి తప్పుల చిట్టాను చెప్పాడు. అభి టాస్కు చేయలేదని నాగార్జున నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇక అభి మాట్లాడుతూ.. మోనాల్‌తో లింక్ చేయకండని ఎన్నోసార్లు అభ్యర్థించాను సర్. పైగా దెయ్యం ఇచ్చిన టాస్క్‌లో నేను మోనాల్‌ను ఏడిపించానని అన్నారు. కానీ నేను ఏడిపించలేదు అని చెప్పాడు. దీంతో నాగ్ ఓ వీడియోను చూపించారు. అందులో అభిజితే మోనాల్‌ను ఏడిపించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అభి క్షమాపణలు కోరాడు.
అయితే ఇది మొదటిసారి కాదని నాగార్జున మండిపడ్డాడు. నా సీజన్‌లో మోనాల్ కోణమే నన్ను ఇబ్బందికి గురి చేస్తోందని అతడు వివరించాడు. ఇక చివరకు టాస్కు చేయకపోవడం తన తప్పని అంగీకరించడంతో.. నాగ్ గేట్లను క్లోజ్ చేయమన్నాడు. తరువాత మాట్లాడుతూ.. తప్పును అంగీకరించకపోతే నువ్వు బయటకు వెళ్లిపోయేవాడివని అని నాగ్ హెచ్చరించారు. పన్నెండు వారాలు ముగుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరించినా, నవ్వుతూ చెప్పినా ఇంకా మీరు గేమ్ సరిగా ఆడటం లేదు. మీకు దండం పెడుతున్నా. గేమ్ ఆడండి అని నాగార్జున అన్నాడు. దీంతో సారీ సార్ అంటూ బాగా ఆడుతామని చెప్పారు. ఆ తరువాత మోనాల్ సేవ్ అయినట్లు నాగ్ తెలిపారు.