Bigg Boss 4: కంటెస్టెంట్‌ల టార్గెట్‌.. మాస్టర్‌కి నాగార్జున బంపరాఫర్‌

బిగ్‌బాస్‌ 4లో ఎలిమినేషన్‌లో భాగంగా చివరకు మెహబూబ్‌, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మిగిలారు. దీంతో వారిద్దరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పంపారు నాగార్జున

Bigg Boss 4: కంటెస్టెంట్‌ల టార్గెట్‌.. మాస్టర్‌కి నాగార్జున బంపరాఫర్‌

Updated on: Nov 02, 2020 | 7:11 AM

Nagarjuna offer Rajasekhar: బిగ్‌బాస్‌ 4లో ఎలిమినేషన్‌లో భాగంగా చివరకు మెహబూబ్‌, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మిగిలారు. దీంతో వారిద్దరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పంపారు నాగార్జున. ఆ తరువాత ఒక బోర్డుపై మెహబూబ్‌, మాస్టర్ ఫొటోలను పెట్టి ఇంట్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో తెలియజేయాలని నాగార్జున సభ్యులకు సూచించారు. ఈ క్రమంలో అరియానా, అవినాస్‌ మాత్రమే అమ్మ రాజశేఖర్ మాస్టర్‌కి ఓటేయగా.. మిగిలిన వారు మెహబూబ్‌కి ఓటేశారు. ( Bigg Boss 4: ఎలిమినేట్ అవ్వని ‘అమ్మ’.. అంతా నోయల్‌ చలువే)

దీంతో మాస్టర్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. నోయల్‌ అభ్యర్థన మేరకు ఈ వారం ఎలిమినేషన్ లేనట్లు నాగార్జున ప్రకటించారు. అంతేకాదు ఈ సందర్భంగా అమ్మకు ఓ బంపరాఫర్ కూడా నాగార్జున. హౌజ్‌లో ఎక్కువ మంది మాస్టర్‌కి వ్యతిరేకంగా ఓటేసినందుకు గానూ.. నెక్ట్స్‌ వీక్ కెప్టెన్సీకి డైరెక్ట్‌ కంటెండర్‌గా అమ్మను ఎంపిక చేశారు నాగార్జున. దీంతో మాస్టర్ సంతోషం రెండింతలు అయ్యింది. ఒకసారి మీ పాదం ముందు పెట్టండి బాబు పాదాభివందనం చేస్తా అంటూ మాస్టర్ అనగా.. షేక్ హ్యాండ్ చాలంటూ నాగార్జున అన్నారు. ( ప్రధాని మోదీని ఆకట్టుకున్న చిన్నారి పాడిన గేయం)

Loading...
Unable to load recommendations.
Follow Us