Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక

| Edited By:

Oct 21, 2020 | 7:27 AM

బిగ్‌బాస్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. మంగళవారం "కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు" అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చాడు

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక
Follow us on

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. మంగళవారం “కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు” అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రాక్షసుల టీమ్‌లో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ ఉండగా.. అభిజీత్, నోయల్, లాస్య, రాజశేఖర్, దివి, సోహెల్, మోనాల్‌లు మనుషుల టీమ్‌లో ఉన్నారు.

ఇక టాస్క్‌లో భాగంగా ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి.. గార్డెన్ ఏరియాలో ఉన్న రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్ష‌సులను మనుషులుగా మార్చితే మనుషుల టీమ్‌ గెలిచినట్లు. ఇక మంచి మనుషులకు ఇచ్చిన టాస్క్‌లను రాక్షసుల టీమ్ సభ్యులు చెడగొడుతూ ఉంటారు. అయినా స‌రే సహనాన్ని వీడకుండా ఆడాలి.

ఇక రాక్షసుల కాస్టూమ్‌ ధరించిన వారు చెలరేగిపోయారు. ముఖ్యంగా అరియానా, హారిక రచ్చ రచ్చ చేశారు. హారిక, అవినాష్‌లు అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ షర్ట్‌లో ఐస్ గడ్డలు వేశారు. హారిక అయితే రాజశేఖర్‌కు ఫేసియల్ చేసింది. అయితే అమ్మ రాజశేఖర్ శాంతి శాంతి అంటూ కామెడీ పండించారు. టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పువ్వులతో 50 దండలు అల్లమంటే.. 54 అల్లి విజయం సాధించారు మనుషుల టీమ్‌. దీంతో రాక్షసుడి బొమ్మ నుంచి రెండు తలలు పగలగొట్టి అఖిల్‌ని మంచి మనిషిగా మార్చారు.

ఆ తరువాత మట్టితో వంద ప్రమిదలు చేసే టాస్క్‌లోనూ 160 చేసి మనుషులే గెలిచారు. దీంతో మరో రెండు రాక్షసుడి తలలు పగలగొట్టి మెహబూబ్‌ని మంచి మనిషిగా మార్చాలని అతడి కోసం వెతికారు. అదే సమయంలో సొహైల్‌కి హారిక దొరికింది. అయితే తాను ఉన్నప్పటికీ.. వేరే మనిషి కోసం వెతకడం హారికకు నచ్చలేదు. దీంతో కెమెరా ముందుకు వచ్చి హారిక కంటతడి పెట్టుకుంది. తాను మంచి మనిషిగా మారడం ఎవ్వరికీ ఇష్టం లేదని, అందుకే లగ్జరీ బడ్జెట్‌లో వచ్చే ఒక్క వస్తువును కూడా ముట్టుకోనని ఏడ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌ ఈ రోజు కంటిన్యూ అవ్వనుంది.

Read More:

ఆన్‌లైన్‌లోనే  ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు

కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి