Akhil Birthday Celebrations: మంగళవారం అఖిల్ బర్త్‌బే కాగా.. బిగ్‌బాస్‌లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు తయారు చేసిన కేక్‌ని కట్ చేశాడు అఖిల్. దానిమీద అఖిల్ నం.1 అని రాసి ఉంచారు. ఇక మొదట ఎవరికి తినిపిస్తాడు అని అందరిలో ఉండగా.. తానే తిన్నాడు. ఇక అఖిల్ బర్త్‌డే సందర్బంగా మోనాల్ అతడిని ముద్దులతో ముంచెత్తింది. అఖిల్‌తో అర్థరాత్రి ముచ్చట్లు పెట్టి.. బర్త్ డే స్పెషల్ అంటూ స్పెషల్ హగ్ ఇచ్చి, ముద్దులు పెట్టింది. దీంతో అబ్బా రోజూ బర్త్ డే ఉంటే బావుండు అంటూ అఖిల్ తెగ మురిసిపోయాడు. అయితే ఇది కేవలం బర్త్ డే స్పెషల్ మాత్రమే అంటూ మోనాల్ సిగ్గుపడిపోయింది. ఇదిలా ఉంటే పాత గొడవలు ఎన్ని ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి అఖిల్‌కి అభిజిత్ బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఆ మధ్యన అభి పుట్టినరోజు వేడుకలకు అఖిల్ దూరంగా ఉన్నప్పటికీ.. వాటన్నింటిని పట్టించుకోకుండా అభి చేసిన చర్య అందరినీ మెప్పించింది.