Gangavva new captain: కొత్త కెప్టెన్ కోసం రంగు పడుద్ది జాగ్రత్త అనే టాస్క్‌ని ఇచ్చారు బిగ్‌బాస్. అఖిల్ సంచాలకుడిగా ఈ టాస్క్ స్టార్ట్ అయింది. దివి వెళ్లి అఖిల్ పాట్‌ని ఖాళీ చేసేసింది. ఆ తరువాత అవినాష్, హారిక, అభిజిత్ పాట్‌లలోని రంగు నీళ్లన్నీ పారబోశారు. గంగవ్వ జోలికైతే ఎవరూ వెళ్లలేదు. దీంతో గంగవ్వ కెప్టెన్సీ టాస్క్‌ను విన్ అవ్వగా.. ఆమెను కొత్త కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించారు. ఆ తరువాత సూపర్ సినిమా పాటకు బిగ్ బాస్ భామలు ఓ రేంజ్‌లో స్టెప్పులు వేయగా.. పొట్టి బట్టలతో దివి, అరియానా, హారికలు రచ్చ రేపారు.
కాగా హౌజ్‌లోకి వెళ్లిన తరువాత మొదటిసారిగా కెప్టెన్‌గా ఎంపికయ్యారు గంగవ్వ. రెండోవారంలో కాస్త అనారోగ్యానికి గురైనప్పటికీ.. మళ్లీ గంగవ్వ యాక్టివ్ అయ్యింది. ఇక ఇటీవల జరిగిన ఉక్కు హృదయం టాస్క్‌లో గంగవ్వ అదరగొట్టింది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌ల్లో గంగవ్వ యాక్టివ్‌గా ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read More: