Bigg Boss 4: మళ్లీ ఇంటికి పోతానన్న గంగవ్వ

| Edited By:

Oct 09, 2020 | 8:28 AM

గత కొన్ని రోజులుగా బాగానే ఉన్న గంగవ్వ మనసు ఇప్పుడు మళ్లీ ఇంటివైపు మళ్లింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో అన్నం పోతలేదు, ఇంటికి వెళ్లిపోతా అంటూ అఖిల్‌తో చెప్పి బాధపడింది

Bigg Boss 4: మళ్లీ ఇంటికి పోతానన్న గంగవ్వ
Follow us on

Bigg Boss 4 Gangavva: గత కొన్ని రోజులుగా బాగానే ఉన్న గంగవ్వ మనసు ఇప్పుడు మళ్లీ ఇంటివైపు మళ్లింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో అన్నం పోతలేదు, ఇంటికి వెళ్లిపోతా అంటూ అఖిల్‌తో చెప్పి బాధపడింది. అయితే షో మొదట్లో యాక్టివ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారంలో ఇలానే డీలా పడ్డారు. అప్పుడు గంగవ్వ కాస్త అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయితే నిన్ను బాగా చూసుకునే హామీ నాదంటూ నాగార్జున భరోసా ఇచ్చిన తరువాత ఆమె మళ్లీ కోలుకున్నారు.

ఇదిలా ఉంటే గంగవ్వ హౌజ్‌లో ఉన్న మాటేగానీ.. వయసు దృష్ట్యా కొన్ని టాస్క్‌లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరికొన్ని టాస్క్‌లు గంగవ్వకు ఇవ్వడం లేదు. కాగా గతవారం జరిగిన కాయిన్స్ టాస్క్‌లో ఆమె పాల్గొనకపోవడంతో నాగార్జున కూడా స్పందించారు. అలా పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి పాల్గొంటానని గంగవ్వ ఆ సమయంలో చెప్పింది. ఇదంతా పక్కనపెడితే కొద్ది రోజులు బావుంటూ, మరికొన్ని రోజులు ఇంటికి పోతానంటూ గంగవ్వ అంటుండం వీక్షకులను కూడా కన్ఫ్యూజ్‌ చేస్తోంది.

Read More:

Bigg Boss 4: అభిజిత్‌- హారిక రొమాన్స్‌‌.. ఒంటరిగా ఏడ్చేసిన అఖిల్‌

Bigg Boss 4: కిరికిరి చేసిన అభిజిత్‌.. ఏడ్చేసిన హారిక