Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ 55 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల 55 రోజుల ప్రయాణాన్ని బిగ్‌బాస్ వీడియో వేసి చూపించాడు. ప్రేమలు, అలకలు, గొడవలు, చిలిపి పనులు, బాధలు అన్నింటి సమ్మేళనమైన మధుర ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుందామని అన్నాడు. ఇక ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్‌లు ఎమోషనల్ అయ్యారు. అభిజిత్, అవినాష్‌లు కెమెరా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తరువాత అభి, మోనాల్, అఖిల్‌లు ముగ్గురూ కలిసి హగ్ చేసుకోవడం.. ఎమోషనల్ అవడం.. షోకే హైలైట్‌గా అనిపించింది. ఈ సందర్భంగా ముగ్గురూ చాలా సందడిగా మాట్లాడుకున్నారు.
Read More:
Bigg Boss 4: ఇష్టమైన బొమ్మను తిరిగిచ్చిన బిగ్‌బాస్.. ఏడ్చేసిన అరియానా