Sohail vs Ariyana: గత వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిన సుజాత బిగ్‌బాంబ్‌ని సొహైల్‌పై వేసిన విషయం తెలిసిందే. దీంతో హజ్‌లో ఈ వారం అంట్లన్నీ తోమేపని సొహైల్‌కి ఇచ్చారు. దీంతో సొహైల్ నానా తిప్పలు పడుతున్నాడు. కెప్టెన్ అయ్యి కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాం అనుకుంటే, నాతో పాత్రలు తోమిస్తున్నారంటూ బాధపడుతూ అవి కడిగేశాడు. అయితే సామాన్లు కడుగుతా కానీ కప్‌లు కడగను అని సొహైల్ అనేశాడు. అయితే అఖిల్ కప్పు నేను కడుగుతాను తీసి పక్కన పెట్టు అని మోనాల్ చెప్పేసింది.
సొంతంగా వాడుకున్న కప్పులు కూడా ఎవరు కడగడం లేదని, వాటిని దాచిపెడతానని సొహైల్ తెలిపాడు. అలా పెట్టొద్దని, దానివల్ల గొడవలు అవుతాయని అమ్మ రాజశేఖర్ మాస్టర్ చెప్పాడు. ఆ తరువాత ఇంటిలో ఇప్పటి వరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ఇబ్బందులు రాలేదు. కానీ నువ్వు మొదలుపెట్టిన తరువాత పాత్రలు శుభ్రంగా ఉండటం లేదని అమ్మ రాజశేఖర్ మాస్టర్ అన్నాడు. దానికి సొహైల్.. రోజు నువ్వే వంట పాత్రలు శుభ్రం చెయ్యి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడు అని బిగ్గరగా చెప్పాడు. నేను కడిగేస్తానులే అని మాస్టర్ తెలిపాడు.
ఆ తరువాత సొహైల్‌కి అరియానా ఏదో చెప్పబోయింది. అది వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు సొహైల్. దాంతో అరియానా ఫైర్ అయ్యింది. దీన్నే అతి అంటారు. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరు అంటూ అరియానా ఫైర్ అయ్యింది. దానికి సొహైల్ సహనం కోల్పోయాడు. అయితే నాగార్జున.. ఆడపిల్లలపై ఎవరూ అరవొద్దని హెచ్చరించిన విషయాన్ని బాగా మైండ్‌లో పెట్టుకున్నట్టు ఉన్నాడు సొహైల్. తన యాటిట్యూడ్‌కి భిన్నంగా కూల్‌గానే ఉన్నాడు. అరియానా వదలకుండా రచ్చ కంటిన్యూ చేస్తూ విసుగు తెప్పించింది. దీంతో మధ్యలో కుమార్ సాయి కల్పించుకున్నాడు. వేలు చూపిస్తూ అడగడంతో.. సొహైల్, కుమార్ సాయిని వేలు దించమన్నాడు. ఎంత దించాలంటూ కుమార్ సాయి చాలా వెటకారంగా అడిగాడు. ఆ తరువాత బిగ్‌బాస్ కెమెరా ముందుకు వెళ్లి అరియానాపై కంప్లైంట్ చేశాడు. అరియానా కూడా బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చింది.
Read More:
Breaking: కారు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు గాయాలు
Bigg Boss 4: ఇదంతా కాని పని.. మోనాల్ మొహం మీదే చెప్పేసిన అభి