Bigg Boss 4 Ariyana: బిగ్‌బాస్ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా స్టోర్ రూమ్‌లోకి వెళ్లిన అరియానాను బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ చేశాడు. ఆమెకు ఇష్టమైన చింపాంజీ బొమ్మను తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఇల్లు గుర్తొచ్చి అరియానా ఎమోషనల్ అయ్యింది. అరియానా ఏడుస్తుండగా.. ఆమెకు అవినాష్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏం కాదంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ఇక ఎపిసోడ్ చివర్లోనూ అరియానా ఏదో ముభావంగా అనిపించింది. ఒంటరిని అయ్యానని అనిపిస్తోంది అంటూ ఏడ్చింది. దీంతో అవినాష్ మేమంతా ఉన్నామంటూ మళ్లీ ఓదార్చాడు. అయితే అరియానా ఎందుకు అలా ఫీల్ అవుతుందో ఆమెకే తెలియాలి.
Read More:
Bigg Boss 4: మళ్లీ కలిసిపోయిన అభి-అఖిల్-మోనాల్