Akhil slams Abhijeet: సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అభిజిత్.. సొహైల్, మోనాల్‌లను తన ఫ్రెండ్‌లుగా చెప్పాడు. ఇక అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్ తనపై వాడిన సింపథీ, ఫేక్ పదాలను గుర్తు చేసిన అఖిల్ పెద్ద క్లాస్ పీకాడు. ”పచ్చకామెర్లు వచ్చినోడికే లోకం మొత్తం పచ్చగా కనపడుతుందంట. అలా నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ్లు కూడా నీకు ఫేక్‌లా కనిపిస్తారు” అంటూ ఫైర్ అయ్యాడు.
ఇక సింపథీ కార్డులు ఎప్పుడూ పనిచేయవు అన్న హారిక మాటను కూడా అఖిల్ గుర్తుచేశాడు. తనను హారిక ‘ఐ హేట్ యు’ అని అన్నదని.. అసలు నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేశావు అని అఖిల్ డైరెక్ట్‌గా అడిగాడు. ఆ తరువాత లాస్య దగ్గరకి వచ్చి.. ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరవాత అతనిపై జోక్‌లు వేస్తారని అస్సలు అనుకోలేదని అన్నాడు. నువ్వు నవ్వుకుంటూ జోకులు వేస్తావు. కానీ వాటి వలన తాను ఎంత ఫీలై ఉంటానని ప్రశ్నించాడు. ఇక మెహబూబ్‌కి ఓ సలహా ఇచ్చి వదిలేశాడు.