Bigg Boss 4: మోనాల్‌పై అభిజిత్‌ బాడీ షేమింగ్ కామెంట్లు

గత కొన్ని రోజులుగా అభిజిత్‌, మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె విషయాల్లో పెద్దగా దూరని అభిజిత్

Bigg Boss 4: మోనాల్‌పై అభిజిత్‌ బాడీ షేమింగ్ కామెంట్లు

Edited By:

Updated on: Oct 30, 2020 | 7:59 AM

Abhijeet Monal Bigg Boss 4: గత కొన్ని రోజులుగా అభిజిత్‌, మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె విషయాల్లో పెద్దగా దూరని అభిజిత్‌.. ఈసారి మాత్రం మోనాల్‌ని హేళన చేస్తూ మాట్లాడాడు. మోనాల్‌ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఒంటెలా నడుస్తుందని, ఆమెను చూస్తే మంచి మజా వస్తుందని కామెంట్లు చేశాడు. నువ్వు కూడా అబ్జర్వ్ చెయ్యి అంటూ నోయల్‌ని కెలికాడు అభి. దానికి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నావో అన్న నోయల్‌.. మరి నువ్వు దుబాయ్‌ షేక్‌లా కూర్చున్నావని సెటైర్ వేశారు. అయితే ఈ మధ్య అభి పలుమార్లు నోరు జారుతున్నాడు. ఇక ఇప్పుడు మోనాల్‌పై డైరెక్ట్‌గా కామెంట్లు చేయడంతో అతడిపై నెగిటివ్‌ పెరిగే అవకాశం ఉంది.

Read More:

Bigg Boss 4: మాస్టర్‌ కక్కుర్తి.. అరియానాతో గొడవ

Bigg Boss 4: కొత్త కెప్టెన్‌గా అరియానా