బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4… ఏకాగ్రత టాస్క్‌లో అభి ఆన్సర్స్ అదుర్స్… హౌస్‌లో తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ఎవరంటే…

| Edited By:

Dec 11, 2020 | 8:53 AM

బిగ్‌బాస్ హౌస్‌లో చివరి ఎలిమినేషన్స్ సందర్భంగా బిగ్‌బాస్ ఒక టాస్కు ఇచ్చాడు. ప్రేక్షకులను డైరెక్టుగా ఓట్ చేయమని కోరే అవకాశం కోసం మూడు టాస్క్‌లు ఇచ్చాడు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4... ఏకాగ్రత టాస్క్‌లో అభి ఆన్సర్స్ అదుర్స్... హౌస్‌లో తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ఎవరంటే...
Follow us on

బిగ్‌బాస్ హౌస్‌లో చివరి ఎలిమినేషన్స్ సందర్భంగా బిగ్‌బాస్ ఒక టాస్కు ఇచ్చాడు. ప్రేక్షకులను డైరెక్టుగా ఓట్ చేయమని కోరే అవకాశం కోసం మూడు టాస్క్‌లు ఇచ్చాడు. అందులో ఒకటే ఏకాగ్రత టాస్కు. ఈ టాస్కులో ఒక కంటెస్టెంట్ టైంను లెక్కించాలి. మిగితా కంటెస్టెంట్లు టాస్కు పర్ఫామ్ చేస్తున్న ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీయాలి. అయితే ఈ టాస్కును అభి ఆడుతున్నప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

తెలివైనోడి… సమాధానం అదుర్స్…

 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లో ఉన్న కంటెస్టెంట్లలో అందరి కంటే మైండ్ గేమర్‌గా అభిజిత్‌కు మంచి పేరొచ్చింది. అతడు ఆట ఆడే విధానం, మాట్లాడే తీరు, తోటి కంటెస్టెంట్లకు ఇచ్చే సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అభి ఏకాగ్రత టాస్కును ఆడాడు. ఈ క్రమంలో అభిని డిస్టర్బ్ చేయడానికి హారిక ప్రయత్నించింది. అందుకోసం అభిని ఈ హౌస్‌లో శివ‌గామి ఎవ‌రు? అని ప్రశ్నించింది. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన ప‌నే లేద‌న్నట్లుగా అభి ట‌పీమ‌ని ఆన్సరిచ్చాడు. శివ‌గామిలో అందం మోనాల్‌కు ఉంది, శివ‌గామిలో ఉన్న టెర్రర్ అరియానాకు, శివ‌గామిలోని ప్రేమ హారిక‌కు ఉంద‌ని చెప్పాడు. దీంతో అంద‌రూ అవాక్కయ్యేలా చేశాడు. పోనీ శివ‌గామి, అనుష్క, త‌మ‌న్నా ఎవ‌రో చెప్పమ‌ని అడ‌గ్గా అరియానా.. శివ‌గామి, హారిక.. త‌మ‌న్నా, మోనాల్.. అనుష్క అని సూపర్ ‌గా సమాధానమిచ్చాడు.