AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : టైటిల్ విన్నర్ అయితే నీకు అవి కొనిస్తా… సోహెల్‌తో ఒప్పందం చేసుకున్న అఖిల్

బిగ్ బాస్ సీజన్ 4 చివరకు వచ్చేసింది. గత సీజన్స్ లానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇంటి సభ్యులు ఒక రోజు గొడవలు పడతారు మరోరోజు కలిసిపోతారు.

Bigg Boss 4 : టైటిల్ విన్నర్ అయితే నీకు అవి కొనిస్తా... సోహెల్‌తో ఒప్పందం చేసుకున్న అఖిల్
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2020 | 3:56 PM

Share

బిగ్ బాస్ సీజన్ 4 చివరకు వచ్చేసింది. గత సీజన్స్ లానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇంటి సభ్యులు ఒకరోజు గొడవలు పడతారు మరోరోజు కలిసిపోతారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ హూస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అఖిల్ సోహెల్ మధ్య కూడా ఇలానే జరుగుతుంది. కష్ట సమయం వచ్చినప్పుడు అఖిల్ కోసం సోహెల్ , సోహెల్ కోసం అఖిల్ నిలబడుతూ.. వారిమధ్య ఫ్రెండ్ షిప్ ను చాటుకుంటున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఈ ఇద్దరు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారు. అంతకు ముందు జరిగిన డిస్కషన్ లో ఈ ఇద్దరు ఓ డీల్ ను సెట్ చేసుకున్నారు.

ఇద్దరు కూర్చొని బిగ్ బాస్ విన్నర్ అయితే ఎం చేస్తారో మాట్లాడుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటే ఎం చేస్తావ్.? అని అఖిల్ సోహెల్ ను అడిగాడు. ఏముంది సినిమాలు చూస్తా అని సమాధానం ఇచ్చాడు సోహెల్..ఎందులో చూస్తావ్.? అని అఖిల్ మళ్లీ అడిగాడు.. ఫోన్లో చూస్తా నాకు ల్యాప్ టాప్ లేదు. రూమ్ లో ఎవడో కొట్టేసాడు అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. దానికి అఖిల్ నా దగ్గర కూడా ల్యాప్ టాప్ లేదు అన్నాడు. నేను టైటిల్ విన్ అయితే నీకు ల్యాప్ టాప్ కొనిస్తా అని సోహెల్ అన్నాడు. దానికి అఖిల్ నేను బిగ్ బాస్ విన్నర్ అయితే నీకు బైక్ , ల్యాప్ టాప్ కొనిస్తా నువ్వు విన్ అయితే నాకు కొనివ్వాలి అంటూ డీల్ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనేదాని పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిజిత్ టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొందరు అంటుంటే ఈ సారి అమ్మాయిలకు ఛాన్స్ ఉంటుందేమో అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!