స్టేజ్‌పై ఊహకందని స్టార్స్..గూస్‌బంప్స్ రేపనున్న నాగ్ ఇంట్రో..

|

Nov 03, 2019 | 4:11 PM

బుల్లితెర ప్రేక్షకులను ఇన్ని రోజులు ఉర్రూతలూగించిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లోనే గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క..ఈ ఒక్క రోజు ఒక లెక్క. ఈ రోజు ప్రేక్షకులకు విజివల్ ట్రీట్ అందించేందుకు ‘స్టార్ మా’ అన్ని ఏర్పాట్లు చేసింది. వన్ బై వన్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ‘బిగ్ బాస్’ అండ్ టీం సండే అటెన్షన్ మొత్తాన్ని గ్రాబ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో […]

స్టేజ్‌పై ఊహకందని స్టార్స్..గూస్‌బంప్స్ రేపనున్న నాగ్ ఇంట్రో..
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను ఇన్ని రోజులు ఉర్రూతలూగించిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లోనే గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క..ఈ ఒక్క రోజు ఒక లెక్క. ఈ రోజు ప్రేక్షకులకు విజివల్ ట్రీట్ అందించేందుకు ‘స్టార్ మా’ అన్ని ఏర్పాట్లు చేసింది. వన్ బై వన్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ‘బిగ్ బాస్’ అండ్ టీం సండే అటెన్షన్ మొత్తాన్ని గ్రాబ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్టార్స్‌తో స్టేజ్ దద్దరిల్లింది.

హీరో శ్రీకాంత్, నిధి అగర్వాల్, అంజలి, కేథరిన్, రాశీ ఖన్నా, డైరెక్టర్ మారుతి..మరికొందరు బల్లితెర, వెండితెర నటులు స్టేజ్‌పై కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. రేటింగ్‌లో రికార్డులు బద్దలుకొట్టేందుకు ‘స్టార్ మా’ సిద్దమైపోయినట్టు తెలుస్తోంది. ఇక టైటిల్ అందించేందుకు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఇక నాగ్ హీరోయిన్లతో కలిసి ‘కింగ్’ సినిమాలోని పాటకు వేసిన స్టెప్స్‌తో రిలీజ్ చేసిన ప్రోమో మరో రేంజ్‌లో ఉంది. హౌజ్ మేట్స్, వారి కుటుంబ సభ్యులు..మరోవైపు సెలబ్రిటీలు, మిక్డ్స్ ఎమోషన్స్‌తో ఈ రోజు ఓ ఉగాది పచ్చడి లాంటి ఎపిసోడ్ రెడీ అవుతోంది.

ఇక విన్నర్ విషయంలో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాహులే విన్నరంటూ చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది.  లెట్స్ వెయిట్ అండ్ సీ.