Bigg Boss 4 Update: బిగ్‌బాస్‌లో సండే ఎపిసోడ్ ఫన్‌డే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లతో డిఫరెంట్ టాస్క్‌లను ఆడించే నాగార్జున.. ఇవాళ జండర్ ఈక్వాలిటీ అనే టాస్క్‌ని వారిచేత చేయించబోతున్నారు. అందులో భాగంగా మగవాళ్లు, ఆడవారిలా.. ఆడవాళ్లు, మగవారిలా దుస్తులను ధరించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. అందులో గంగవ్వ మొదటిసారిగా ఫ్యాంట్, షర్ట్ వేసుకోగా.. అందులో అదరగొట్టేశారు. ఇక మగవారిలో సొహైల్ అమ్మాయిగా అదరగొడుతున్నాడు. ఇక హారిక, మోనాల్, దివి అబ్బాయిలుగా యాట్యిట్యూడ్‌ని చూపించారు. వారి అవతారాలను చూసిన నాగార్జున.. ఇవాళ తనకు ఎలాంటి కళలు వస్తాయో అంటూ కామెంట్ చేశారు. ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో మరింత ఫన్ ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
Read More:
కుక్కల ముందు పిల్లాడి ‘భాంగ్రా’ స్టెప్పులు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి కారణాలివేనట..!