బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్.. షాక్‌లో నెటిజన్లు!

| Edited By: Anil kumar poka

Oct 22, 2019 | 4:20 PM

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా ఎవరూ ఊహించని కంటెస్టెంట్ అవతరిస్తాడా? గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కాకుండా మరో వ్యక్తి టైటిల్ గెలుస్తాడని అనిపిస్తోంది. ప్రస్తుతం షో చివరి దశకు చేరుకుంది. హౌస్‌లో ఉన్న సభ్యులు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే గత వారం వితిక ఎలిమినేట్ కావడంతో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఇందులో వచ్చే వారం శివజ్యోతి ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎదుర్కొంటుందని […]

బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్.. షాక్‌లో నెటిజన్లు!
Follow us on

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా ఎవరూ ఊహించని కంటెస్టెంట్ అవతరిస్తాడా? గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కాకుండా మరో వ్యక్తి టైటిల్ గెలుస్తాడని అనిపిస్తోంది. ప్రస్తుతం షో చివరి దశకు చేరుకుంది. హౌస్‌లో ఉన్న సభ్యులు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే గత వారం వితిక ఎలిమినేట్ కావడంతో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఇందులో వచ్చే వారం శివజ్యోతి ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎదుర్కొంటుందని ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు.

ఇదిలా ఉంటే  కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ‘టికెట్ టూ ఫినాలే’ టాస్క్ ఇచ్చాడు. అందులో వరుణ్-రాహుల్, బాబా భాస్కర్-అలీ, శ్రీముఖి-శివజ్యోతిలు తలబడనున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు కంటెస్టెంట్ల బలాబలాలు. ఇప్పుడు ఉన్న ఇంటి సభ్యులందరూ తమదైన శైలితో బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.

అందరిలోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కంటెస్టెంట్  అలీ రెజా.. షో మొదటి నుంచి ఇప్పటివరకు తనదైన శైలితో దూసుకుపోతున్నాడు. ఫిజికల్ టాస్క్ ఏదైనా అలీనే ముందు వరుసలో ఉంటూ వచ్చాడు. అంతేకాక బయటికి వచ్చిన కంటెస్టెంట్లు సైతం అలీ అంటేనే టాస్క్.. టాస్క్ అంటేనే అలీ అని చెప్పారు. అటు బిగ్ బాస్ ఇప్పటివరకు నిర్వహించిన అన్ని టాస్కుల్లో కూడా బెస్ట్ పెరఫార్మెర్‌గా నిలిచాడు. రీసెంట్‌గా బిగ్ బాస్ ఇచ్చిన ఫినాలే టాస్క్‌లో కూడా అలీ రెజా మరోసారి తనేంటో అనేది నిరూపించుకుంటున్నాడని చెప్పొచ్చు.

హౌస్ నుంచి అలీ బయటికి వెళ్లి.. మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చాడన్నది ఒకటే మైనస్ తప్పితే.. నాగార్జున సైతం అలీ రెజానే హౌస్‌లో ‘ది బెస్ట్ పెరఫార్మర్’ అని కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఊహించని విధంగా అలీ రెజా బిగ్ బాస్ టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.