అలీ ఎలిమినేషన్.. హౌస్‌మేట్స్ భావోద్వేగం!

అలీ ఎలిమినేషన్.. హౌస్‌మేట్స్ భావోద్వేగం!

అందరూ అనుకున్న విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అగ్రెసివ్ కంటెస్టెంట్ అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చివరిగా రవికృష్ణ, అలీ రెజా, మహేష్ విట్టా ముగ్గురూ రేసులో నిలవగా… అలీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనితో హౌస్‌లోని కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇకపోతే యాంకర్లు శ్రీముఖి, శివజ్యోతిలు ఇద్దరూ అలీని పట్టుకుని ఏడ్చేశారు. గత కొన్ని వారాలుగా వీరిద్దరూ అలీతో మంచి రిలేషన్‌షిప్‌ను మెయింటైన్ చేశారు. ఒక్కసారిగా […]

Ravi Kiran

|

Sep 08, 2019 | 11:36 PM

అందరూ అనుకున్న విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అగ్రెసివ్ కంటెస్టెంట్ అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చివరిగా రవికృష్ణ, అలీ రెజా, మహేష్ విట్టా ముగ్గురూ రేసులో నిలవగా… అలీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనితో హౌస్‌లోని కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇకపోతే యాంకర్లు శ్రీముఖి, శివజ్యోతిలు ఇద్దరూ అలీని పట్టుకుని ఏడ్చేశారు. గత కొన్ని వారాలుగా వీరిద్దరూ అలీతో మంచి రిలేషన్‌షిప్‌ను మెయింటైన్ చేశారు. ఒక్కసారిగా క్లోజ్ అయిన వ్యక్తి వదిలి వెళ్లిపోయేసరి ఇద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు. అంతేకాకుండా అలీతో రోజూ గొడవ పడే రాహుల్ సిప్లిగంజ్ కూడా కన్నీరు పెట్టుకోవడం విశేషం. ఇక కంటెస్టెంట్లు అందరూ తనను చూసి అంతలా ఏడ్చేయడంతో అలీ రెజా హుందాగా స్పందించాడు. తాను వెళ్ళిపోతే ఇంతమంది బాధపడతారని ఊహించలేదని.. వారి మనసును గెలుచుకోవడంతో ఒకరకంగా తాను బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్లేనని అలీ అన్నాడు.

ఎంత అగ్రెసివ్‌గా, రూడ్‌గా ఉన్నా బిగ్ బాస్ ఇచ్చే అన్ని టాస్కుల్లోనూ ఉత్సాహంగా పాల్గొనే కంటెస్టెంట్ అలీ రెజా అని చెప్పవచ్చు. గేమ్‌ను మలుపులు తిప్పే క్రమంలో ఒక్కోసారి ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవలు జరుగుతుంటాయి. ఇలానే దాదాపు అందరితోనూ గొడవలు పెట్టుకున్న అలీ రెజా.. ఇవాళ ఎలిమినేట్ అయ్యాడు. ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అలీ రెజా లేకుంటే షో చూడడం వేస్ట్ అని.. అతడు అగ్రెసివ్‌గా ఉన్నా.. అన్ని టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనే ఏకైక వ్యక్తి అలీ అని వ్యూయర్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కోపంలో ప్రవర్తించే విధానం, ఆ సమయంలో నోటిని అదుపులో ఉంచుకోకపోవడమే అలీ ఎలిమినేషన్‌కు కారణాలుగా చెబుతున్నారు.

మరోవైపు బయటికి వచ్చిన అలీకి.. హౌస్‌మేట్స్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు పర్మిషన్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఏడవకుండా, స్ట్రాంగ్‌గా ఉండాలని శివజ్యోతికి సూచించగా.. బాబా భాస్కర్ మాస్టర్‌ను ఇన్‌స్పిరేషన్ తీసుకుని.. ఎలా ఆడుతున్నావో అలానే ఆడమని మహేష్కు సలహా ఇచ్చాడు. మంచోడు రవికి శివజ్యోతిని చూసుకోమని చెప్పి… గేమ్ మీద ఏకాగ్రత ఉండాలని చెప్పాడు. యూ ఆర్ అమేజింగ్‌.. ఫైనల్ వరకు ఉంటావని అలీ వరుణ్‌కు కితాబిచ్చాడు. పునర్నవి-అలీ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొంచెం చూస్తూ మాట్లాడు అంటూ రాహుల్‌కు, జ్యోతిని కూడా కాస్త చూస్తూ ఉండు అని వితికాను కోరాడు. విన్నర్‌గా చూడాలనుకుంటున్నా అని శ్రీముఖికి తెలిపాడు.

గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్‌లో భాగంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని, నాగార్జునతో కలిసి స్టేజిపై సందడి చేశాడు. మూవీలో నాని రైటర్ కాబట్టి.. హౌస్‌మేట్స్‌కు సరిపోయే క్యారెక్టర్స్‌ను సూచించాడు. అనంతరం నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్‌ను ప్లే చేసి హౌస్‌మేట్స్‌కు చూపించాడు. కాగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్.. మున్ముందు ఎలాంటి ట్విస్ట్‌లను ప్రేక్షకులకు అందిస్తుందో వేచి చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu