Kabul attack – Afghanistan: 20 ఏళ్లపాటు శ్రమించి శాంతియుత ఆఫ్గన్‌ను అందించామని చెప్పిన అగ్రదేశాలు మళ్లీ ఆయుధాలకు పని చెప్పాల్సిందేనా? లేదంటే మళ్లీ సెప్టెంబర్ తరహా దాడులు ఎదుర్కోక తప్పదన్న సందేహంతో అమెరికా సైతం భయపడుతోందా? ప్రజాస్వామ్యబద్దంగా తాలిబన్ల పాలన ఉంటుందని ఒప్పందం జరిగినా.. వాళ్లకంటే ముందే తీవ్రవాద ముఠాలు వచ్చి మరీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాక్షసుల చేతికి రాజ్యం వెళితే.. ఏం జరుగుతుందో.. కరెక్ట్‌గా అక్కడ అదే జరుగుతోంది. ఆప్ఘన్‌లో హింసాకాండ ఊహించిందే.. కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న అమాయకులపై పగబట్టి మరీప్రాణాలు తీస్తున్నాయి రాకాసిమూకలు.
కాబూల్‌లో మళ్లీ మారణహోమం స్రుష్టిస్తున్నారు తీవ్రవాదులు. తాలిబన్ల అరాచకాలకు భయపడి పారిపోదామనుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులపై బాంబుల వర్షం కురుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగానే.. ఐసిస్ ఖోరసన్ గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఒంటినిండా బాంబులు ధరించి జనాల్లోకి ప్రవేశించిన.. రెండు మానవ మృగాలు ఊహించని ఘోరాన్ని సృష్టించాయి. వందల మంది జనాల మధ్యకి వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది వరకూ చనిపోగా.. 160 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 13 మంది అమెరికా సైనికులున్నారు. పేలుడు ఘటన తర్వాత కాబూల్ ఎయిర్ పోర్టులో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికి ఎవరు అన్నట్టుగా మారింది. ప్రాణం ఉంటే చాలని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పారిపోతున్నారు. ఇక్కడ ఉంటే ప్రాణాలు దక్కవు. ఎక్కడికైనా వెళ్లిపోవాలన్న ఆరాటమే వాళ్లలో కనిప్తోంది. ఎయిర్‌పోర్టుకు వేలాది మంది చేరుకుంటున్నారు.
ఆప్ఘన్ ఘటనలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ISIS ఉగ్రవాదులను చంపేయాల్సిందిగా.. బైడన్ ఆదేశించారు. తమ సైనికులను చంపిన వారిని.. ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా.. వెంటాడి వేటాడుతామన్నారు బైడెన్. కానీ ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. అక్కడ వందల మంది తీవ్రవాదులు చేరుకున్నారు. అమెరికా బలగాలు ఎంతమంది ఉన్నారు? తాలిబన్లు పెంచి పోషించిన తీవ్రవాద సంస్థలన్న ఒక్కసారిగా జడలు విప్పుతున్నాయి. మళ్లీ బాంబులు తయారుచేసి మారణహోమం సృష్టించడంలో బిజీగా ఉన్నాయి.
మరి ఆఫ్గన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు చూడలేమా? మళ్లీ అక్కడ అగ్రదేశాల దళాలు మళ్లీ మోహరించాల్సిందేనా? లేదంటే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం ముప్పు తప్పదా? ఇంతకాలం అమెరికా పట్ల భయంతో దాక్కున్న ఉగ్రమూకలు మళ్లీ ఆఫ్గన్‌లో శిక్షణ శిబిరాలు నడుపుతూ ప్రపంచానికి ప్రమాదంగా మారతాయా.?
ఇదే అంశంపై బిగ్ న్యూస్ బిగ్‌డిబేట్ జరిగింది… రక్షణ రంగ నిపుణులు చేసిన కీలక వ్యాఖ్యల కోసం కింద లింక్ క్లిక్ చేయండి.