తెలంగాణలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో రాజకీయంగా పార్టీలన్నీ హైపర్ యాక్టీవ్ అయ్యాయి. విమర్శలకు, ప్రతివిమర్శలకు అయితే ఓకే కానీ ఏకంగా వీధియుద్ధాలకే దిగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో రాజకీయపార్టీలు చేస్తున్న యాత్రలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మొన్న భైంసాలో బండి సంజయ్ యాత్ర సందర్భంగా రాళ్ల దాడులు, రోడ్లపై నిరసనలతో అట్టుడికింది. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల యాత్ర రణరంగాన్ని తలపించింది. ఓ వైపు రాళ్ల దాడి.. మరోవైపు ఫ్లెక్సీలు, విగ్రహాలు, వాహనాలకు నిప్పు పెట్టడంతో యుద్ధాన్ని తలపించింది. దీనికి కొనసాగింపుగా హైదరాబాదులో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో షర్మిల అరెస్టు హైటెన్షన్ క్రియేట్ చేసింది.
ప్రజాస్వామ్యబద్దంగా యాత్రలు చేస్తుంటే పాలకులే అడ్డుకుంటున్నారంటోంది వైఎస్‌ఆర్‌టీపీ. అటు కోర్టు అనుమతిలో యాత్రకు సిద్ధమైన బీజేపీ పెద్దలు కూడా బైంసాలో ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, ఎంఐఎం పైనా సంచలన ఆరోపణలు చేశారు.
యాత్రల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగాల్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తున్నారు కొందరు. గడిచిన రెండు ఎన్నికల్లో ప్రశాంతంగా సాగిన ప్రచారం ఇప్పుడే ఉద్రిక్తతంగా మారడం దేనికి సంకేతం? ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్. కింది వీడియోలో చూడండి.
మరిన్ని బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..