ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?

Big News Big Debate : BJP vs YCP War ||- Rajinikanth TV9, ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?

-కన్నాను వైసీసీ టార్గెట్‌ చేసిందా?
– బలపడేందుకు కాషాయవ్యూహం ఏంటి?
-రంగులు మార్చే బలముందంటూ సంకేతం

ఏపీ రాజకీయాల్లో ప్రతిసారీ రంగులే సెంటర్‌ ఆఫ్‌ ఎట్ట్రాక్షన్‌ అవుతున్నాయి. గతంలో కార్యాలయాల రంగులపై అధికార, విపక్షాల మధ్య యుద్ధం నడిస్తే.. ఇప్పుడు పార్టీ రంగులపై కత్తులు దూసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డి పెట్టిన ఓ ట్వీట్‌ మూడు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. బీజేపీలో పసుపుపచ్చ మిడతల దండు దాడిచేస్తుందని.. వలసలను ఉద్దేశించి ఆ పార్టీని హెచ్చరించారు విజయసాయిరెడ్డి. దీనిపైనే ఇప్పుడు ఇరుపార్టీల మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తోంది. ఇంతకీ ఇది వారా? పొలిటికల్‌ గేమా?

బీజేపీ వర్సెస్‌ వైసీపీ
TDP నుంచి ఇప్పటికే కీలక నేతలు బీజేపీ గూటికి చేరారు. నలుగురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జాబితా చాలానే ఉంది. ఇటీవల విజయనగరం జిల్లాలో కాషాయజెండా కప్పుకున్నారు ఇంకొందరు చోటా నాయకులు. చాలామంది జాబితాలో ఉన్నారన్నది వినిపిస్తున్న టాక్‌. అయితే దీనిపై విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఏడాదిగా తినడానికి ఏమీ లేక పచ్చ మిడతల దండు కమలంపై వాలేందుకు బయలుదేరిందని వ్యాఖ్యానించారు.

Big News Big Debate : BJP vs YCP War ||- Rajinikanth TV9, ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?
ఈ కామెంట్లపై కమలనాథులు కస్సుమంటున్నారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఏకంగా సీఎం జగన్‌కు లేఖ రాశారు. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టడం మంచిది కాదని.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకునేలా చూడాలని లేఖలో రాశారు.

Big News Big Debate : BJP vs YCP War ||- Rajinikanth TV9, ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?

BJP రాష్ట్ర అధ్యక్షుడు కన్నా రాసిన లేఖపై మరోసారి ట్వీట్‌ ద్వారానే స్పందించారు విజయసాయిరెడ్డి. మీరు అన్ని పార్టీ వ్యవహారాల్లో వేలుపెడతారు.. మేం అప్రమత్తం చేస్తే తప్పా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అజెండాలో భాగంగా ఏపీలో కమలాన్ని కబళించే పనిలో ఉన్న పచ్చమిడతల దండులో మీరూ భాగస్వాములుగా ఉన్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

Big News Big Debate : BJP vs YCP War ||- Rajinikanth TV9, ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?
దీనిపై ఏకంగా నేషనల్‌ పార్టీనే రంగంలో దిగింది. పసుపునే కాదు ఏ రంగును అయినా కాషాయంగా మార్చగల పార్టీ తమదని.. మీరంగు ఫేడ్‌ చేస్తున్న రఘురామరాజు సంగతి చూసుకోండి అంటూ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ‌ధర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Big News Big Debate : BJP vs YCP War ||- Rajinikanth TV9, ఏపీలో కమలవ్యూహం.. వైసీపీ సాయమా?
దీంతో ఇరుపార్టీల మధ్య కయ్యం పీక్‌లో ఉంది. అయితే దీనిపై భిన్నవాదనలున్నాయి. విజయసాయిరెడ్డి సహజంగానే బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉంటారు. అలాంటిది ఆ పార్టీతోనే నేరుగా ఫైట్‌ ఎందుకు మొదలుపెట్టారన్నది ఇప్పుడు అందరిలో మొదులుతున్న ప్రశ్న. అయితే ఇరుపార్టీలు కలిసి ఆడుతున్న డ్రామానే అన్నది కొందరి వాదన. టీడీపీ బలహీనపరిచి రెండోస్థానంలో నిలబడాలన్న లక్ష్యంగా వైసీపీతో కలిసి బీజేపీ వ్యూహాలు రచిస్తుందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇక TDP నుంచి వచ్చిన బీజేపీ నేతలను, కన్నాను లక్ష్యం చేయమని కమలంలో ఉన్న వర్గమే విజయసాయిరెడ్డికి సంకేతాలు ఇచ్చిందని.. అందుకే తరచుగా ఆయన టార్గెట్‌ చేస్తున్నారని అంటున్నారు ఇంకొందరు. ఏప్రిల్‌లో కూడా కరోనా కిట్ల విషయంలో కన్నా ఆరోపణలు చేస్తే… విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీకి 20కోట్లకు అమ్ముడుపోయారని సుజనాచౌదరి మధ్యవర్తిగా వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రమాణాలవరకూ వెళ్లింది. రకరకాల వాదనలు ఉన్నాయి.
ఇక రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకునేలా బీజేపీ నేతలపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా హైలెట్‌ చేస్తున్నారన్న చర్చా ఉంది. అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రఘురామరాజుపై ఫిర్యాదు చేసింది వైసీపీ. స్పీకర్ పరిధిలో నిర్ణయం ఉంది. ఈ సమయంలో బీజేపీ , వైసీపీ మధ్య ఫైట్‌ ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుందన్నది రసవత్తరంగా మారింది. పైగా ట్వీట్‌ వార్‌లో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునిల్‌ దేవధర్‌ కూడా రఘురామరాజు వ్యవహారాన్ని ప్రస్తావన తీసుకరావడం వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా ఈ కొత్త పరిణామం మాత్రం ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఏ రంగునైనా కాషాయంగా మార్చగలిగే బలముందని బీజేపీ ఇస్తున్న సంకేతాలు చూస్తుంటే.. ఏపీలో పెద్ద స్కెచ్‌ వేసిందన్న అనుమానాలున్నాయి. మొత్తానికి ఎవరి ఎజెండాతో వారు రాజకీయాలు చేస్తున్నారు.. అయితే ఇందులో ట్వీట్లకు పరిమితం అవుతుందా? లేక యాక్షన్ ప్లాన్‌ కూడా ఉంటుందన్నదే చూడాలి. ఏదైనా దీని ఫలితం తేలాలంటే… కొంతకాలం వేచి ఉండాల్సిందే.

ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో చర్చ జరిగింది.. వీడియో కోసం లింక్‌ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *