షాకింగ్.. కేంద్రం భారీ ప్యాకేజీపై మండిపడ్డ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ..!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చతికిలపడ్డ సంగతి తెలిసిందే. అందులో మన దేశంలో కూడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చేసిన ప్రకటనలపై సంఘ్ పరివార్‌కు అనుబంధ సంస్థ […]

షాకింగ్.. కేంద్రం భారీ ప్యాకేజీపై మండిపడ్డ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ..!
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 1:14 PM

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చతికిలపడ్డ సంగతి తెలిసిందే. అందులో మన దేశంలో కూడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చేసిన ప్రకటనలపై సంఘ్ పరివార్‌కు అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా మండిపడింది. మోదీ ప్రకటించిన ప్యాకేజీపై రోజువారీగా కేంద్ర ఆర్ధికమంత్రి వివరిస్తున్నారని.. అయితే మొదటి మూడు రోజులపాటు ప్రకటనలను ఉత్సాహంగా విన్నప్పటికీ.. నాలుగోరోజు చేసిన ప్రకటనలు నిరుత్సాహానికి గురిచేశాయని.. ఇది విచారకరమైన రోజంటూ బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ్ మండిపడ్డారు.

లాక్‌డౌన్ ప్రభావంతో బొగ్గు, ఖనిజాలు, రక్షణ శాఖ ఉత్పత్తులు, విమాన రంగం, విమానాశ్రాయాలు, విద్యుత్ లాంటి.. ఎనిమిది కీలక రంగాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే ఈ రంగాలను తిరిగి పట్టాలెక్కించడానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రభుత్వ కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండానే.. ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడమేంటంటూ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని.. ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనంటూ విర్జేశ్ ఉపాధ్యాయ్ మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయంపై ఇప్పటికే భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక ఉద్యమాలను చేపట్టిందని.. కేంద్రం తెచ్చే ప్రతీ మార్పు కూడా.. తొలుత ఉద్యోగి మీదే పడే అవకాశం ఉందని.. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కీలకమైన రంగాల్లో కేంద్రం మౌలిక మార్పులు తెస్తోందని, అవన్నీ సరిగ్గా లేవన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలనేవి ప్రాథమిక ప్రక్రియ అని.. కానీ ఆ చర్చల అంశాన్ని ప్రభుత్వం మరిచిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో