న్యూడ్ ఫోటోస్ పంపించమని స్నేహితురాలికి బెదిరింపులు..విద్యార్థి అరెస్ట్!

BBA student held for sexval harassment, న్యూడ్ ఫోటోస్ పంపించమని స్నేహితురాలికి బెదిరింపులు..విద్యార్థి అరెస్ట్!

హైదరాబాద్‌ : ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించడం ఆర్యా మూవీలో చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్.  ప్రెండ్షిప్ చెయ్యకపోతే  చనిపోతానని బెదిరించాడు ఓ ప్రబుద్దడు. బెదిరింపులకు భయపడ్డ ఆ యువతి వాడితో స్నేహం చేసింది. ఆ సమయంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. పోకిరీ బెదిరింపులకు యువతి భయపడుతుండటంతో ఆ దుర్మార్గుడి చేష్టలు తారా స్థాయికి చేరాయి. న్యూడ్ ఫోటోలు పంపించాలని లేకపోతే గతంలో చనువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోస్ మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో ఓసారి న్యూడ్ ఫోటోస్ పంపించింది. వాటిని ఆసరాగా చేసుకుని ఆ యువకుడు ఆమెను నిత్యం వేధించడం మెుదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రయనుద్దీన్‌(19) శంకర్‌పల్లిలోని ఓ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతూ వసతిగృహంలో ఉంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు. తొలినాళ్లలో ఆమె తిరస్కరించింది. పదేపదే తనతో స్నేహం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు అంగీకరించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నాడు. ఇదే అదనుగా తాను చెప్పినట్లుగా ఉండాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అందుకు అంగీకరించకపోతే సెల్ఫీ చిత్రాలను ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానంటూ హెచ్చరించడంతో… బాధితురాలు మిన్నకుండిపోయింది. దీంతో మరింత రెచ్చిపోయాడు. ఓరోజు బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి థియేటర్‌కు సినిమాకు వెళ్లింది. ఆ సమయంలో రయనుద్దీన్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. వాష్‌రూంలోకి వెళ్లి స్వీయ నగ్నచిత్రాలను వాట్సప్‌లో తనకు పంపించాలంటూ డిమాండ్‌ చేశాడు. చివరకు ఒత్తిడికి తలొగ్గి అతడి కోరిక నెరవేర్చింది. ఆ చిత్రాలు తన చేతికి చిక్కేసరికి వేధింపులు మరింత పెంచాడు. తట్టుకోలేని బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.ఎం.విజయ్‌కుమార్‌ బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. రయనుద్దీన్‌ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *